BIG BREAKING : స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ఇవే చివరి ఎన్నికలు అని ఆయన అన్నారు.
మరోసారి ఎన్నికల్లో పోటీ చేయబోనని చెప్పారు. పదవిలో ఉన్న సమయంలోనే ప్రజా సమస్యల పరిష్కారం కోసం కష్టపడ్డాను అని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారినట్టు ఆయన చెప్పారు.
21 నెలలుగా తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని కడియం శ్రీహరి వెల్లడించారు. పార్లమెంట్ ఎన్నికల ముందు కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన కూతురు కాంగ్రెస్ పార్టీ నుండి ఎంపీగా పోటీ చేసి గెలిచారు.
బీఆర్ఎస్ బి ఫాం పై గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరడం పై బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టు ఆశ్రయించింది. ఇప్పుడు ఆ కేసు చివరి దశకు చేరుకుంది.
త్వరలో కడియం శ్రీహరి పై వేటుపడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. అయితే జరగబోయే బైపోల్ లో సింపథీ కోసమే ఆయన అలా మాట్లాడారన్న చర్చ కూడా జరుగుతోంది.
స్టేషన్ ఘనపూర్ పట్టణ కేంద్రాలలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ మరియు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణి కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్బంగా స్టేషన్ ఘనపూర్ మండలానికి సంబందించిన 34మంది కల్యాణ లక్ష్మి లబ్ధిదారులకు 34లక్షల 03వేల 944రూపాయల విలువగల చెక్కులను, 38మంది ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్ధిదారులకు 15లక్షల 47వేల 500 రూపాయల విలువగల చెక్కులను లబ్ధిదారులకు పంపిణి చేశారు.
తర్వాత ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ…
కొంత మంది రాజకీయంగా మాట్లాడకుండా వ్యక్తి గత విమర్శలు చేస్తూ అత్యంత నీచ స్థాయికి దిగజారి మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇలాంటి వారి వల్ల ప్రస్తుత రాజకీయాలు బ్రష్టు పడుతున్నాయని అన్నారు.
స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ కేంద్రంలో 100పడకల అస్పత్రి నిర్మాణం జరగడం లేదా…., ఇంటిగ్రెటెడ్ రెవెన్యూ డివిజన్ ఆఫీస్ నిర్మాణం జరగడం లేదా…., ఘనపూర్ నుండి నవాబ్ పేట ప్రధాన కాలువ సిసి లైనింగ్ పనులు జరగడం లేదా అని ప్రశ్నించారు.
Read Also : 2025 బతుకమ్మ పాటలు ఇవే..!
గ్రామ గ్రామాన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం జరగడం లేదా…., గ్రామాలలో సిసి రోడ్ల నిర్మాణం జరగడం లేదా… ఇవేవి వారి కళ్ళకు కనిపించడం లేదని ఆరోపించారు. తాను తప్పుడు పనులు చేయనని.. ఎవరి దగ్గరతల వంచనని స్పష్టం చేశారు.
మళ్ళీ ఎమ్మెల్యే గా పోటీ చేసేది లేదని తనకున్న ఏకైక ఎజెండా నియోజకవర్గ అభివృద్ధి మాత్రమేనని అన్నారు. రాజకీయాలకు అతీతంగా నియోజకవర్గ అభివృద్ధికి కలిసిరావాలని కోరారు.
నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి, నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్నానని వెల్లడించారు. 21నెలలోనే 1026కోట్ల అభివృద్ధి నిధులు తీసుకువచ్చానని, ఆ అభివృద్ధి పనుల వివరాలను ప్రజల ముందు పెట్టానని అందులో ఏ ఒక్కటి తప్పని నిరూపించిన దానికి పూర్తి బాధ్యత తనదేనాని తెలిపారు.
ఈ రూ.1026కోట్ల అభివృద్ధి నిధులు కేవలం జనవరి 2024 నుండి ఇప్పటి వరకు మంజూరు అయినవి మాత్రమేనని తెలిపారు. ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం 3 ఏళ్ళు ఉంటుందని, రానున్న 3ఏళ్లలో మరో 2వేల కోట్ల అభివృద్ధి నిధులు తీసుకు వస్తానని హామీ ఇచ్చారు.
స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గానికి ఉన్న చెడ్డ పేరును తొలగించి అభివృద్ధి చెందుతున్న నియోజకవర్గంగా పేరు తెస్తానని వెల్లడించారు.
వినూత్న సంక్షేమ పథకాల అమలుతో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. రాష్ట్రంలో నీరుపేద ప్రజల కష్ట సుఖలలో పలుపంచుకుంటూ ముందుకు వెళ్తుందని తెలిపారు.
ఆడపిల్లల తల్లిదండ్రులు పెళ్లి చేసిన వెంటనే దరఖాస్తు చేసుకుంటే 2నెలల్లో చెక్కు అందజేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక దేశంలో ఎక్కడా లేని సంక్షేమపథకాలు అమలుచేస్తోందని తెలిపారు.
Read Also :

