Electoral bonds : KTRను ఇరికించబోయి తానే ఇరుక్కున్న రేవంత్ రెడ్డి..!

Revanth reddy caught by Electoral bonds issue in formula e race case

Electoral bonds : ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి ఏసీబీ ఒక నివేదిక ఇచ్చినట్టుగా  లీకులు వచ్చాయి. అలాగే.. ఫార్ములా ఈ సంస్థ నుండి బీఆర్ఎస్ పార్టీకి రూ.44 కోట్ల ఎలక్టోరల్ బాండ్లు వచ్చాయని.. ఇది క్విడ్ ప్రో కో అని ఏసీబీ తేల్చిందని కూడా ఆ లీకుల్లో ఉంది.

దీనిపై కేటీఆర్ స్పందించారు. అదో లొట్టపీసు కేసు అని కొట్టిపారేశారు. అటు హరీష్ రావు కూడా దీనిపై రెస్పాండ్ అయ్యారు. గ్రూప్ 1 ఇష్యూ నుండి డైవర్షన్ కోసం ఈ లీకులు ఇచ్చారని చెప్పారు.

Read Also :

అయితే.. ఇందులో అసలు విషయం మరొకటి ఉంది. డైవర్షన్ కోసమో, మరో ప్రయత్నోంలో భాగంగానో ఇవాళ ఫార్ములా ఈ పై కొన్ని లీకులు ఇచ్చారు.

బాండ్లతో దొరికిపోయిన రేవంత్ రెడ్డి..?

ఇందులో ఎలక్టోరల్ బాండ్ల అంశాన్ని ప్రస్తావించారు. వాళ్లు బాండ్లు(Electoral bonds) ఇచ్చారు కాబట్టే.. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఫార్ములా ఈ ఆపరేషన్స్ సంస్థకు నిధులు  ఇచ్చింది అన్నట్టుగా ప్రభుత్వవాదన ఉంది.

కానీ ఇక్కడే రేవంత్ రెడ్డి బలంగా ఇరుక్కుపోయారు. కాంగ్రెస్ పార్టీని ఇరికించారు.

మెగా ఇంజినీరింగ్ అనే కంపెనీ నుండి కాంగ్రెస్ పార్టీకి రూ.18కోట్ల విరాళాలు అందాయి. ఇది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందే జరిగింది.

ఇప్పుడు అధికారంలోకి వచ్చాక కొడంగల్ లిఫ్ట్ పనులను మెగా కంపెనీకే ఇచ్చారు. సుంకిశాలలో రిటెయినింగ్ వాల్ కూలిపోయినా మెగా సంస్థపై చర్యలు తీసుకోలేదు. ఏకంగా ఆ కంపెనీని బ్లాక్ లిస్టులో పెట్టాలని నిపుణుల కంపెనీ చెప్పినా సర్కారు పట్టించుకోలేదు.

mega company electoral bonds to indian national congress

ఇవే కాదు ఇంకా చాలా కాంట్రాక్టులు మెగా కంపెనీకి ఏకపక్షంగా కట్టబెట్టారు.

అంటే.. రూ.18కోట్ల ఎలక్టోరల్ బాండ్లు ఇచ్చినందుకే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇదంతా చేసిందా..? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. లేకపోతే ఇప్పుడు ఎలక్టోరల్ బాండ్లు రద్దయ్యాయి కాబట్టి నేరుగా నగదు రూపంలో కాంగ్రెస్ పార్టీకి అనధికార విరాళాలు అందుతున్నాయా.?

ఎందుకు మెగా సంస్థకు అన్ని కాంట్రాక్టులు ఇస్తున్నారన్న ప్రశ్న ఉత్పన్నం అవుతోంది.

ఫార్ములా ఈలో జరిగింది క్విడ్ ప్రో కో అయితే.. ఇప్పుడు మెగా కంపెనీ విషయంలోనూ జరుగుతున్నది అదే అవుతుంది కదా అని అంతా చర్చించుకుంటున్నారు.

వాళ్లు రూ.45 కోట్లకు రూ.44 కోట్లఎలక్టోరల్ బాండ్లు ఇచ్చారని అంటున్నారు. అలాంటప్పుడు ప్రస్తుతం వేలకోట్ల కాంట్రాక్టులు మెగా కృష్ణారెడ్డికి అందుతున్నాయి. మరి కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి ఏ స్థాయిలో విరాళాలు వస్తున్నాయోనని అంతా చర్చించుకుంటున్నారు.

రేవంత్ రెడ్డి ఆవేశపూరిత నిర్ణయాలతో ఆయన పరువు పోవడమే కాదు.. పార్టీ పరువు కూడా పోతుందని కాంగ్రెస్ వాళ్లు కూడా నెత్తి పట్టుకుంటున్నారు.

వాళ్ల విషయంలో తప్పు అయితే మన విషయంలో కూడా తప్పు అవుతుంది కదా.? ఇంత చిన్న లాజిక్ ని ఆయన ఎలా మరిచిపోయారని అడుగుతున్నారు.