Mahesh Goud: కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి పదవి వివాదం ముదురుతోంది. సీఎం సీటుపై ఆశలు పెట్టుకున్న చాలామంది సీనియర్లు ముఖ్యమంత్రి ఇటీవల చేస్తున్న వ్యాఖ్యలతో ఆగ్రహానికి గురవుతున్నారు. అసహనం వ్యక్తంచేస్తున్నారు.
సెప్టెంబర్ 5 .. టీచర్స్ డే వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(revanth reddy).. మూడు సార్లు తానే ముఖ్యమంత్రి అవుతానని వ్యాఖ్యానించారు. టీచర్లు బాగా పనిచేస్తే తాను మూడు సార్లు ముఖ్యమంత్రి అవుతానని చెప్పుకొచ్చారు.
ఈ వ్యాఖ్యలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో సెగలు రేపుతున్నాయి.
కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి ఎవరనేది పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుంది. కానీ రేవంత్ రెడ్డి తనకు తానుగా ప్రకటించుకోవడం దుమారం రేపుతోంది.
Read Also : కవితపై హరీష్ రావు సంచలన రియాక్షన్
దీనిపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్(Mahesh Goud) స్పందించారు. 2028లో రేవంత్ రెడ్డి నాయకత్వంలోనే ఎన్నికలకు వెళ్తామని ఆయన చెప్పారు. అయితే.. ముఖ్యమంత్రి ఎవరనేది మాత్రం గెలిచిన ఎమ్మెల్యేలు నిర్ణయిస్తారని అన్నారు.
అంటే రేవంత్ రెడ్డి తానే మూడు సార్లు ముఖ్యమంత్రి అని చెప్పుకోవడంపై ఆగ్రహంతోనే ఇలా మాట్లాడారని తెలుస్తోంది.
త్వరలోనే రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రి అవుతారని మహేష్ గౌడ్ చాలా రోజులుగా చెబుతున్నారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం తానే మరో రెండు టర్మ్ లు ముఖ్యమంత్రి అని పదే పదే చెప్పుకుంటున్నారు.
దీనిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(komatireddy rajagopalreddy) కూడా తీవ్ర అసహనంతో ఉన్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రిపై ఆగ్రహం వ్యక్తంచేశారు.
రేవంత్ రెడ్డి ఇప్పుడు చేసిన వ్యాఖ్యలతో ఈ వివాదం ఎక్కడిదాకా వెళ్తుందోననేది అంతుపట్టడం లేదు.
Read Also :
- 15 ఏళ్లు నేనే ముఖ్యమంత్రి
- ఎదురింటోడితో లేచిపోయిన తోటికోడళ్లు.! చివర్లో అసలు ట్విస్ట్..!
- కవితపై కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు
- చెల్లి పెళ్లి జరగాలి మళ్లీ మళ్లీ..!
..

