Ponnam Prabhakar : 42 శాతం బీసీ రిజర్వేషన్ల జీవోపై హైకోర్టు స్టే విధించడంపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. జీవోపై హైకోర్టు స్టే విధిస్తుందని అనుకోలేదన్నారు.
రాహుల్ గాంధీ నాయకత్వంలో సామాజిక న్యాయం చేసి ఎన్నికలకు వెళ్తామన్నారు.

తాము బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నామని చెప్పారు. ఉత్తర్వులు కాపీ అందిన తరువాత చట్టపరంగా, న్యాయపరంగా భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు.
రిజర్వేషన్ల సాధన కోసం ప్రభుత్వం తరుపున బలమైన వాదనలు వినిపించామని ఆయన చెప్పారు.
డెడికేటెడ్ కమిషన్ వేసి, కుల గణన నిర్వహించి.. కేబినెట్ సబ్ కమిటీ వేసి.. అన్నీ చట్టబద్ధంగానే చేశామని ఆయన వివరించారు.
కోర్టు ఆదేశాల వల్ల ఎన్నికలు మరింత ఆలస్యం అయ్యే ప్రమాదం ఉందన్నారు. ఎన్నికలు జరగకపోవడం వల్ల.. కేంద్రం నుండి గ్రామాలకు రావాల్సిన నిధులు ఆగిపోయాయని ఆయన తెలిపారు.
ఏది ఏమైనా 42 శాతం రిజర్వేషన్లు సాధించి తీరుతామన్నారు. సామాజిక న్యాయానికి కాంగ్రెస్ ఛాంపియన్ అని పొన్నం చెప్పారు.
BRS, బీజేపీలు హైకోర్టు నడుస్తున్న కేసులో ఎందుకు ఇంప్లీడ్ కాలేదో ఎందుకు ఇంప్లీడ్ కాలేదో జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు.
Read Also :

