Ponguleti : మేడారం పనుల టెండర్ల వివాదం మరింత ముదురుతోంది. ఇద్దరు మంత్రులు ఒకరిపై మరొకరు కత్తులు దూసుకునే దాకా వెళ్లింది. ఇప్పటికే ఈ అంశంపై మంత్రి కొండా సురేఖ పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivas reddy) స్పందించారు. దేవాదాయ శాఖ మంత్రి, ఉమ్మడి వరంగల్ కు చెందిన మంత్రి కొండా సురేఖ(Konda Surekha) లేకుండానే మేడారం (medaram temple) పనులను పరిశీలించిన తర్వాత ఆయన మాట్లాడారు.
రూ.70 కోట్ల కాంట్రాక్టు కోసం కక్కుర్తిపడే వ్యక్తిని తాను కాదని ఆయన అన్నారు. అలాంటి అవసరం తనకు లేదన్నారు.
మాస్టర్ ప్లాన్ కు అనుగుణంగా రూ.211 కోట్లు కేటాయించినట్టు చెప్పారు. భక్తుల భద్రత, రక్షణకు ప్రాధాన్యత ఇస్తూ ఆధునీకరణ పనులు చేస్తున్నామని అన్నారు. 90 రోజుల్లో పనులు పూర్తి చేస్తామని చెప్పారు. రాతి కట్టడాలకు కావల్సిన గ్రానైట్ పొరుగు రాష్ట్రాల నుండి తెప్పిస్తున్నామని తెలిపారు.
ఆదివాసీల ఆచార సంప్రదాయాలకు విఘాతం కలుగకుండా నిర్మాణాలు చేపట్టబోతున్నామని పొంగులేటి తెలిపారు.
తనపై సహచర మంత్రులెవరూ ఫిర్యాదు చేశారని తాను నమ్మడం లేదన్నారు. తనమీద ఫిర్యాదు చేయడానికి ఏమీ లేదని పొంగులేటి అన్నారు. మంత్రులు సీతక్క, సురేఖ.. సమ్మక్క, సారక్క లాగా పనిచేస్తున్నారని చెప్పారు.
..
Also Read :

