BIG BREAKING : బాత్రూమ్ లోనే ఆర్టీసీ కండక్టర్ కు గుండెపోటు.. సెకన్లలోనే

ఇటీవల కాలంలో గుండెపోటు కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మనతో మాట్లాడిన మనిషి కాసేపటికి విగతి జీవిగా మారిపోతున్నాడు. పెద్దల నుంచి పిల్లల వరకు గుండెపోటుకు బలవుతున్నారు.. ఇప్పుడు కనిపించడం మంచి కాసేపటికి కనుమరుగైపోతున్నాడు. చూస్తుండగానే కుప్పకూలిపోతున్నాడు. తాజాగా హైదరాబాద్ లో దారుణం జరిగింది.

గుండెపోటుతో ఆర్టీసీ కండక్టర్ మృతి చెందాడు. పండ‌రి అనే కండక్టర్ మియాపూర్ డిపోలో కండ‌క్టర్‌గా పనిచేస్తున్నాడు. ఈ రోజు ఉద‌యం డ్యూటీకి వ‌చ్చిన పండ‌రి వాష్‌రూమ్‌కు వెళ్లాడు. అక్కడే గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయాడు. పండ‌రిని గ‌మ‌నించిన తోటి ఉద్యోగులు వెంటనే అతన్ని ఆస్పత్రికి త‌ర‌లించారు. అయితే గుండెపోటుతో కండ‌క్టర్ ప్రాణాలు కోల్పోయిన‌ట్లు డాక్టర్లు నిర్ధారించారు.

దీంతో డిపోలో విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి. కండ‌క్టర్ మృతి ప‌ట్ల‌ తోటి ఉద్యోగులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కొన్ని నిమిషాల క్రితం తమతో మాట్లాడిన పండ‌రి విగతజీవిగా మారడంతో తోటి ఉద్యోగులు షాక్ అయ్యారు.పండరి మృతితో విషాదంలో తోటి ఉద్యోగులు నిరాశలో మునిగిపోయారు.