KTR : మెట్రో రైలు నిర్వహణ నుండి L&T సంస్థ తప్పుకోవడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కక్షగట్టి.. L&Tని రాష్ట్రం నుండి వెళ్లగొట్టారని ఆరోపించారు.
మేడిగడ్డ విషయంలోనే L&Tపైరేవంత్ రెడ్డి కక్షగట్టారని అన్నారు. మేడిగడ్డలో పిల్లర్లు కుంగిన తర్వాత దానిని తాము ఉచితంగా రిపేర్ చేసి ఇస్తామని L&T సంస్థ చెప్పిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు.
కాళేశ్వరం కొట్టుకుపోయిందని తమ పార్టీ ప్రచారం చేస్తోంటే… మీరు ఎలా రిపోర్ చేసి ఇస్తారని ఎల్ అండ్ టీపై రేవంత్ రెడ్డి (Revanth reddy)కోపం పెంచుకున్నారని అన్నారు. తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు.
అప్పటి నుండి ఎల్ అండ్ టీ సంస్థపై కక్షసాధింపు కొనసాగుతోందని చెప్పారు. అందుకే కొడంగల్ లిఫ్ట్ ప్రాజెక్టు కాంట్రాక్టు.. ఎల్ అండ్ టీకి కాకుండా.. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మెగా కృష్ణారెడ్డిలకు చెందిన కంపెనీలకు ఇచ్చారన్నారు.
మేడిగడ్డ బ్యారేజీని ఉచితంగా రిపేర్ చేసి ఇస్తామని L&T సంస్థ చెప్పింది..
అందుకే రేవంత్ రెడ్డి ఎల్ అండ్ టీపై కుట్ర చేశాడు..
నేను కూలిపోయిందని చెబితే.. మీరు రిపేర్ ఎలా చేస్తారని ఎల్ అండ్ టీపై రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశాడు..
అందుకే మెట్రో నుండి L&T ని వెళ్లగొట్టారు
..KTR pic.twitter.com/bEZ71Txykp— Prabhakar Venavanka (@Prabhavenavanka) September 26, 2025
ఇవే కాదు మరిన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు కేటీఆర్. L&T మెట్రో కి గతంలో 280 ఎకరాల భూములను ప్రభుత్వం కేటాయించిందన్నారు. వాటిని ఎలాగైనా అమ్ముకోవాలని, తమవారికి అప్పజెప్పుకోవాలని రేవంత్ రెడ్డి కుట్రలు చేస్తున్నారన్నారు.
అలాగే ఇప్పటికే మెట్రో నిర్మించిన మాల్స్ ను కూడా తమ వారికి కట్టబెట్టడానికే ఈ కుట్రలు చేస్తున్నారన్నారు.
అలాగే.. రాష్ట్రంలోని మరో కార్పొరేట్ కంపెనీని కూడా రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ చేశారని.. వారంలో ఆ విషయాలు బయటపెడతానని ప్రకటించారు.
ఇక.. హైడ్రా(Hydraa) అనేది భూతం అన్న ఆయన… దాన్ని వదిలించుకోవాలంటే.. మొదట కాంగ్రెస్ అనే భూతాన్ని వదిలించుకోవాలని హైదరాబాద్ ప్రజలకు పిలుపునిచ్చారు.
కేవలం బడా సంస్థలు, రియల్టర్ల దగ్గర వసూళ్ల కోసమే హైడ్రా పనిచేస్తోందని ఆరోపించారు. పేదల ఇండ్లు కూలుస్తూ.. పెద్దల దగ్గర డబ్బులు తీసుకుంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి అన్న ఇంటి మీదకు హైడ్రా ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు.
Read Also :

