KCR : రాష్ట్రంలో వరదలపై కేసీఆర్ రెస్పాన్స్..!

KCR

KCR : తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదలపై మాజీ సీఎం కేసీఆర్ ఆందోళన వ్యక్తంచేశారు. వర్షం, వరదల కారణంగా ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు.
గురువారం ఆయన వరదలతో నష్టపోయిన జిల్లాల పార్టీ నాయకులతో టెలిఫోన్‌లో మాట్లాడి పరిస్థితులను తెలుసుకున్నారు. ప్రజలతో ఎప్పటికప్పుడు ఉండి, సహాయక చర్యల్లో చురుకుగా పాల్గొనాలని సూచించారు.

పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ, బీఆర్‌ఎస్‌ శ్రేణులను సమీకరించి వరద బాధితులకు వెంటనే సహాయం అందించాలని ఆదేశించారు.
ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, మెదక్‌, వరంగల్‌, ఖమ్మం వంటి అనేక జిల్లాల్లో వరదలు తీవ్ర స్థాయిలో దెబ్బతీశాయని ఆయన పేర్కొన్నారు.
ఇళ్లు నీటమునిగిపోవడం, రహదారులు తెగిపోవడం, రవాణా స్తంభించిపోవడంతో ప్రజలు కష్టాల్లో ఉన్నారని చెప్పారు.

విద్యుత్‌ వ్యవస్థలు దెబ్బతినడం, తాగునీటి కొరత తీవ్ర సమస్యగా మారిందని గుర్తుచేశారు. ప్రాణాలను రక్షించేందుకు, బాధితులకు తక్షణ సహాయాన్ని అందించేందుకు ప్రభుత్వ యంత్రాంగం అత్యవసర చర్యలు తీసుకోవాలని చంద్రశేఖర్‌రావు సూచించారు.

Read Also :