KCR : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. జూబ్లీహిల్స్ (Jubileehillsbypoll) నియోజకవర్గ ఉప ఎన్నికలో తమ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భార్య.. సునీత గోపీనాథ్ పేరును ప్రకటించారు.
సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఈ ఉప ఎన్నిక వచ్చింది. త్వరలో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. దీంతో మాగంటి గోపీనాథ్ భార్య పేరునే ప్రకటించారు.

ఆయనకు నియోజకవర్గంలో ఉన్న ఫాలోయింగ్.. ఎన్నికల్లో గెలుపు కోసం పనికి వస్తుందని బీఆర్ఎస్ భావిస్తోంది.
కొద్ది రోజులుగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ప్రజలతో కేటీఆర్ కూడా మాట్లాడారు. వరుసగా సమావేశాలు నిర్వహించారు. వారందరి అభిప్రాయం మేరకే నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ చెబుతోంది.
నియోజకవర్గ ప్రజలంతా గోపీనాథ్ నే గెలిపించాలనే నిశ్చయంతో ఉన్నారని బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు.
Read Also :

