Jubileehills : జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో అక్కడ త్వరలో ఉప ఎన్నిక జరగబోతోంది. బైపోల్ లో ఆయన భార్య మాగంటి సునీత(maganti sunitha).. బీఆర్ఎస్ పార్టీ తరుపున పోటీ చేయబోతున్నారు.
బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిపై క్లారిటీ వచ్చినా.. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు ఎవరనేది క్లారిటీ రావడం లేదు. కాంగ్రెస్ పార్టీ నుండి రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. అయితే ఒకరి పేరు మాత్రం ఫైనల్ అయినట్టు తెలుస్తోంది.
కంజర్ల విజయలక్ష్మి అనే కొత్తపేరు కన్ఫామ్ అయినట్టుగా సమాచారం. మాజీ మంత్రి కంజర్ల లక్ష్మీనారాయణ యాదవ్ కోడలు విజయలక్ష్మి (kanjarla viajayalaxmi) పేరు కన్ఫామ్ అయినట్టు తెలుస్తోంది.

జలగం వెంకట్రావు కేబినెట్‌లో ఆయన మంత్రిగా పనిచేశారు. కంజర్ల లక్ష్మీనారాయణ 1973- 78 వరకు బీసీ, లేబర్ మినిస్టర్ గా పనిచేశారు. ఆయన ఫ్యామిలీలో నియోజకవర్గంలో మంచి పేరుంది.
కంజర్ల విజయలక్ష్మి.. ఎర్రగడ్డలోని ఫేమస్.. గోకుల్ థియేటర్ కు ఓనర్ గా ఉన్నారు.
ఎర్రగడ్డ, బోరబండ, ప్రాంతాలన్నీ జూబ్లీహిల్స్ (Jubileehills) అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోకే వస్తాయి. దీంతో అక్కడ వీరు సేవా కార్యక్రమ్రాలు చేస్తున్నారు. లక్ష్మీనారాయణ పేరుతో జూబ్లీహిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో సేవలు చేస్తున్నారు.
దీంతో ఆమెకే టికెట్ ఇవ్వాలని.. బీఆర్ఎస్ మహిళా అభ్యర్థిని పెట్టడంతో తాము కూడా మహిళా అభ్యర్థినే నిలపాలనే ఆలోచనతో కాంగ్రెస్ ముందుకు పోతున్నట్టు తెలుస్తోంది.
Read Also :

