Elections : తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు ఇప్పట్లో జరిగేలా కనిపించడం లేదు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. ఆ దిశగానే జీవో ఇచ్చింది. దీన్ని పలువురు హైకోర్టులో సవాల్ చేశారు.
అయితే.. రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని సుప్రీంకోర్టు తీర్పు ఉన్నా.. ఎలా జీవో ఇచ్చారని హైకోర్టు మండిపడింది. రిజర్వేషన్లు పెంచేందుకు ఉన్న అడ్డంకులన్నీ తొలగిన తర్వాత… న్యాయపరమైన చిక్కులన్నీ వీడిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని చెప్పింది.
అవసరమైతే ఎన్నికల నిర్వహణపై తాము పెట్టిన డెడ్ లైన్ ను పొడిగిస్తామని కోర్టు చెప్పింది. ప్రభుత్వం ఎక్స్ టెన్షన్ పిటిషన్ వేయాలని సూచించింది.
దీంతో స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పుడప్పుడే జరిగేలా కనిపించడం లేదు. ఒకవేళ ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే.. బీసీ రిజర్వేషన్లను పక్కన పెట్టాల్సి ఉంటుంది. పాత రిజర్వేషన్ ప్రకారమే ఎన్నికలు నిర్వహించాల్సి వస్తుంది. అప్పుడు కాంగ్రెస్ ఇచ్చిన హామీ అమలు కాకుండా పోతుంది.
దీంతో ఇప్పుడు ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోతోందనేది ఆసక్తికరంగా మారింది. ఇవాళ పిటిషన్ పై వాదనలు విన్న హైకోర్టు.. విచారణను అక్టోబర్ 8కి వాయిదా వేస్తున్నట్టు చెప్పింది. అప్పటివరకు ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వొద్దని ప్రభుత్వానికి చెప్పింది. ఒకవేళ నోటిఫికేషన్ ఇచ్చినా ఈ పిటిషన్లు కొనసాగుతాయని తెలిపింది.
దీంతో ఎన్నికలపై ప్రభుత్వం ముందుకు వెళ్లకపోవచ్చని తెలుస్తోంది.
హైకోర్టు ఏదో ఒక నిర్ణయం చెప్పాకే ప్రభుత్వం ముందుకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Read Also :

