Big Breaking: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్

BREAKING NEWS-01-BATUKAMMA.COM

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈసీ కొద్దిసేపటి క్రితమే గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈరోజు నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు.

అక్టోబర్ 21 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. 24వ తేదీ వరకు ఉపసంహరణకు సమయం ఉంటుంది. నవంబర్ 11వ తేదీన పోలింగ్, 14న కౌంటింగ్ ఉండనుంది. షేక్ పెట్ తహసిల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రిటర్నింగ్ అధికారి సమక్షంలో నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. నామినేషన్లకు అన్ని ఏర్పాట్లు చేశామని అధికారులు చెబుతున్నారు.

కాగా బిఆర్ఎస్ నుంచి మాగంటి సునీత, కాంగ్రెస్ నుంచి నవీన్ కుమార్ యాదవ్ బరిలో ఉన్నారు. బిజెపి తన అభ్యర్థిని ఇంకా ప్రకటించాల్సింది. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ మృతితో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది.