Congress : కాంగ్రెస్ సర్కారు మూడేండ్లే ఉంటది..! అందరు కాడి ఎత్తేస్తున్నరు.!

Congress government will not come in to power in telangana said kadiyam srihari 1

Congress : బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను రాజకీయాలకు గుడ్ బై చెప్పబోతున్నానని ప్రకటించారు. ఈ విషయాన్ని గతంలోనూ చెప్పానన్నారు.

ఈ సందర్భంగా ఆయన మరిన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆయన సంచలన కామెంట్స్ చేశారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మరో మూడేళ్లు మాత్రమే అధికారంలో ఉంటుందని చెప్పారు. ఈ మూడేళ్లలో నియోజకవర్గానికి కావాల్సిన నిధులు తీసుకొస్తానని చెప్పారు. అంటే ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ(congress party) మళ్లీ అధికారంలోకి రాదన్నట్టుగా ఆయన మాట్లాడారు.

దీంతో ఆయన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ఒకేసారి రెండు బాంబులు పేల్చడంతో కాంగ్రెస్ లో ఉన్నవాళ్లు కూడా పరేషాన్ అవుతున్నారు.

Read Also : 2025 బతుకమ్మ పాటలు ఇవే..!

ఇప్పటికే రేవంత్ రెడ్డి(Revanth reddy) కూడా అవే మాటలు మాట్లాడారు. విద్యాకమిషన్ పై రీసెంట్ గా రివ్యూ చేసిన ఆయన..  తమ ప్రభుత్వం మూడేళ్లే ఉంటుందని.. దానికి అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పినట్టు తెలిసింది.

అలాగే పలువురు మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా మూడేళ్ల మాటనే మాట్లాడుతున్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు(Jupally krishna rao) కొద్దిరోజుల క్రితం ఆదిలాబాద్ జిల్లాలో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

వచ్చే ఎన్నికల్లో తాను గానీ, తమ పార్టీ గానీ గెలిచే అవకాశాలు లేవన్నారు. తమ ప్రభుత్వం వస్తుందో లేదో కూడా చెప్పలేనన్నారు. అందుకే తాను ఏ హామీలు పడితే ఆ హామీలు ఇవ్వబోనన్నారు.

ఇలా కాంగ్రెస్ నేతలంతా ఒకరి తర్వాత మరొకరు తమ ప్రభుత్వం మూడేళ్లే ఉంటుందని చెప్పుకుంటున్నారు. దీనిపై అంతా ఆశ్చర్యపోతున్నారు. కొద్దిరోజుల క్రితమే.. టీచర్స్ డే రోజున మాట్లాడుతూ.. తాను మూడు సార్లు ముఖ్యమంత్రి అవుతానని రేవంత్ రెడ్డి చెప్పుకున్నారు.

కానీ పదిహేను రోజులు తిరగకుండానే మూడేళ్లే తమ ప్రభుత్వం ఉంటుందని ఆయన కూడా మాట్లాడటంతో కాంగ్రెస్ వాళ్లంతా తలపట్టుకుంటున్నారు. అసలు సర్కారులో ఏం జరుగుతున్నదో అర్థం కాక తలపట్టుకుంటున్నారు.

Read Also :