Breaking News : జూబ్లీహిల్స్ ఎన్నికల వేళ హైదరాబాద్ లో పాలిటిక్స్ హీటెక్కాయి. హైదరాబాద్ సిటీ బస్సుల్లో పెంచిన చార్జీలను వ్యతిరేకిస్తూ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నిరసనలకు పిలుపునిచ్చింది.
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ దగ్గరున్న రెతిఫైల్ బస్టాండ్ నుండి బస్ భవన్ వరకు బస్సులో ప్రయాణించాలని నిర్ణయించారు.
దీంతో సర్కారు అప్రమత్తమైంది. భారీగా పోలీసులను మోహరించింది.
అటు కేటీఆర్ నివాసం దగ్గర పదుల సంఖ్యలో పోలీసులను మోహరించారు. కేటీఆర్ ను ఇంటి నుండి బయటకు రానిచ్చే పరిస్థితి కనిపించడం లేదు.
మరో సీనియర్ నేత హరీష్ రావు ఇంటి దగ్గర కూడా పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు.
సిటీకి చెందిన ఎమ్మెల్యేల ఇంటి దగ్గర కూడా పోలీసు పహారా కొనసాగుతోంది. ఎవరు ఇంటి నుండి బయటకు వచ్చినా అరెస్ట్ చేసేలా పోలీసులు ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.
మరోవైపు.. రెతిఫైల్ బస్టాండ్ దగ్గర కూడా వందల సంఖ్యలో పోలీసులను మోహరించారు.
పోలీసుల మోహరింపుపై కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాము శాంతియుతంగా వెళ్లి ఆర్టీసీ ఎండీకి వినతిపత్రం ఇవ్వాలని అనుకున్నామన్నారు.
కానీ తన ఇంటి ముందు, తమ పార్టీ నేతల ఇళ్ల ముందు మోహరించిన పోలీసుల సంఖ్య చూస్తే ఆశ్చర్యమేసిందన్నారు. ఒక వ్యక్తి బస్సు ఎక్కకుండా అడ్డుకోవడానికి ఇంతమంది పోలీసులను మోహరిస్తారా అని ఆయన ప్రశ్నించారు.
పోలీసులు.. నేరస్తులను పట్టుకోవడంలో, నేరాలను నియంత్రించడంలో కూడా ఇదే ఉత్సాహం చూపించాలని ఆయన సూచించారు.
BRS పార్టీ.."ఛలో బస్ భవన్" పిలుపు నేపథ్యంలో కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ నేతల ఇళ్ల దగ్గర భారీగా మోహరించిన పోలీసులు..
రేతిఫైల్ బస్టాండ్ దగ్గర వందలాదిగా పోలీసుల మోహరింపు.. pic.twitter.com/uyEd8m9WWN
— PV NEWS (@pvnewstelugu) October 9, 2025
Read Also :

