BREAKING NEWS : రిజర్వేషన్లపై హైకోర్టు షాకింగ్ నిర్ణయం..!

BREAKING NEWS-13-BATUKAMMA.COM

BREAKING NEWS : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో సుధీర్ఘ వాదనలు జరిగాయి. పిటిషనర్ల తరుపు న్యాయవాదులు, సర్కారు తరుపు న్యాయవాదులు వాదనలు వినిపించారు.

మరికొందరు వాదనలు వినిపించాల్సి ఉండటంతో విచారణను రేపు మధ్యాహ్నానికి వాయిదా వేశారు.

వాదనల సందర్భంగా ఆసక్తికర అంశాలు తెరపైకి వచ్చాయి. పలు రాష్ట్రాల్లో ఇదే విధంగా రిజర్వేషన్లు పెంచి.. సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలిన విషయాన్ని పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. నాలుగైదు రాష్ట్రాలకు సంబందించిన అంశాలు సుప్రీంకోర్టులో ఉన్నాయని ఆ వివరాలు కోర్టుకు అందజేశారు.

సర్కారు తరుపున అభిషేక్ మనుసింఘ్వీ వాదనలు వినిపించారు.

విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది. రేపు మధ్యాహ్నం 2.30 గంటల తరువాత దీనిపై విచారణ చేపడుతామంది.

ఎన్నికల ప్రొసీజర్ పై కోర్టు స్టే ఇవ్వలేదు. నామినేషన్లు వేయకుండా స్టే ఇవ్వాలని పిటిషనర్లు కోరగా అందుకు కోర్టు నిరాకరించింది. దీంతో ఈసీ షెడ్యూల్ ప్రకారమే రేపు ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ కానుంది.

 

Read Also :