Breaking News : జూబ్లీహిల్స్ బైపోల్ కాంగ్రెస్ పార్టీలో చిచ్చుపెట్టింది. నవీన్ కుమార్ యాదవ్ కు టికెట్ ఇవ్వడంపై కాంగ్రెస్ లో విభేదాలు భగ్గుమన్నారు.
ఇప్పటికే తీవ్ర అసంతృప్తితో ఉన్న కొందరు నాయకులు పార్టీని వీడేందుకు సిద్ధపడ్డారు. వారిలో అంజన్ కుమార్ యాదవ్ ముందు వరుసలో ఉన్నారు.
టికెట్ కోసం ఆయన ముందు నుండి తీవ్ర ప్రయత్నాలు చేశారు. కానీ ఆయనకు కాకుండా నవీన్ కుమార్ యాదవ్ కు అధిష్టానం టికెట్ కేటాయించింది. దీంతో కాంగ్రెస్ లో సెగలు మంటల దాకా వచ్చాయి.
టికెట్ రాకపోవడంతో తన అనుచరులతో అంజన్ కుమార్ యాదవ్ భేటీ అయ్యారు. పార్టీని వీడేందుకు కూడా ఆయన సిద్ధపడినట్టు తెలుస్తోంది.
రేపు కాంగ్రెస్ పార్టీకి ఆయన రాజీనామా చేయనున్నారని తెలుస్తోంది. ఆ తర్వాత జూబ్లీహిల్స్ నుండి ఇండిపెండెంట్ గా నామినేషన్ వేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
పార్టీకి కష్టకాలంలో అండగా ఉన్న తనకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆయన చాలాకాలంగా అసంతృప్తితో ఉన్నారు. ఇంతలో జూబ్లీహిల్స్ బైపోల్ రావడంతో తనకు టికెట్ ఇస్తారని భావించారు.
కానీ ముందు నుండి పార్టీలో ఉన్న అంజన్ కుమార్ యాదవ్ ను కాదని.. కొత్తగా పార్టీలోకి వచ్చిన నవీన్ కుమార్ యాదవ్ కు టికెట్ ఇచ్చారు.
దీంతో ఆయన పార్టీ నాయకత్వంపై తీవ్రంగా మండిపడినట్టు తెలుస్తోంది.
సరిగ్గా ఎలక్షన్ షెడ్యూల్ వచ్చాక అంజన్ కుమార్ యాదవ్ ఆగ్రహంతో కాంగ్రెస్ పరిస్థితి ఏంటనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.
నవీన్ కుమార్ ఓట్లపై ఇది ఏ మేరకు ప్రభావం చూపిస్తుందోనని అంతా చర్చించుకుంటున్నారు.
Read Also :

