BIG BREAKING : రిజర్వేషన్లపై గవర్నర్ ట్విస్ట్..!

live-updates-breaking-news-20092025

BIG BREAKING : రిజర్వేషన్లపై గవర్నర్ కార్యాలయం షాక్ ఇచ్చింది. బీసీ రిజర్వేషన్ల బిల్లుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని క్లారిటీ ఇచ్చింది. రెండు బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలిపారు.

అయితే ఇందులో బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లు కూడా ఉందని అంతా భావించారు. కానీ రిజర్వేషన్లపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని గవర్నర్ కార్యాలయం వెల్లడించింది.

పలు పంచాయతీలను మున్సిపాలిటీల్లో విలీనం చేస్తూ రూపొందించిన బిల్లులకు మాత్రమే గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిపింది.

దీంతో గందరగొళ పరిస్థితి ఏర్పడింది.

గవర్నర్ కార్యాలయ ప్రకటనతో పంచాయతీ ఎన్నికలపై మరోసారి కన్ఫ్యూజన్ ఏర్పడింది.