BIG BREAKING : హైదరాబాద్ మెట్రో రైలు విషయంలో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటి వరకు మెట్రోను నిర్వహిస్తున్న ఎల్ అండ్ టీ సంస్థ.. తప్పుకుంటున్నట్టు ప్రకటించింది.
హైదరాబాద్ మెట్రోను (BIG BREAKING) పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికే అప్పజెప్పుతున్నట్టు వెల్లడించింది. దీంతో ఇకపై హైదరాబాద్ మెట్రో పూర్తిగా.. రాష్ట్ర ప్రభుత్వ సంస్థగా మారనుంది.
ఈక్విటీ షేర్ కింద ఎల్ అండ్ టీ (L&T METRO)సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం రూ.5900కోట్ల రూపాయలు చెల్లించనుంది.
ఫేజ్ 1 లో కొనసాగడంతో పాటు.. ఫేజ్ 2 ఏ.. ఫేజ్ 2 బీ.. లో కొనసాగాలని రాష్ట్ర ప్రభుత్వం తమను కోరిందని చెప్పారు. కానీ తాము ఎట్టి పరిస్థితుల్లోనూ కొనసాగబోమని ఎల్ అండ్ టీ వెల్లడించింది.
తమకు ఇవ్వాల్సిన బకాయిలు పేరుకుపోవడంతో పాటు.. వడ్డీలేని రుణాల కింద చెల్లించాల్సిన మొత్తాన్ని కూడా సర్కారు చెల్లించడం లేదని ఎల్ అండ్ టీ ఆరోపించింది.
బకాయిలు చెల్లించాలని పదే పదే అడిగినా సర్కారు చెల్లించలేదని తెలిపింది.


అయితే ఇప్పుడు మెట్రోను ఎవరు నిర్వహిస్తారనేది ఆసక్తికరంగా మారింది.
పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం చేతికి వచ్చాక మరో ప్రయివేటు సంస్థకు అప్పజెప్పుతారా.? లేకపోతే మెట్రో రైల్ కార్పొరేషన్ దాన్ని కొనసాగిస్తుందా..? అనేది చూడాలి.
అయితే.. ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆర్టీసీ పరిస్థితి ఎలా ఉందో చూస్తున్నాం. అలాంటిది మెట్రోను సర్కారు టేకప్ చేస్తే ఎలా ఉంటుందోనని అంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అయితే.. కమిషన్ల కోసం సర్కారు పెద్దలు బెదిరించడడం వల్లే ఎల్ అండ్ టీ.. తప్పుకుంటోందని ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది.
Read Also :

