Anjan Kumar: కాంగ్రెస్ పార్టీలో జూబ్లీహిల్స్ రగడ అంతకంతకూ పెరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అంజన్ కుమార్ యాదవ్ తీవ్ర అసహనంతో ఊగిపోతున్నారు.
నవీన్ కుమార్ యాదవ్ కు టికెట్ ఇవ్వడంపై తీవ్రంగా మనస్తాపం చెందారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసేందుకు కూడా సిద్ధపడ్డారు. ఆయనను బుజ్జగించేందుకు కాంగ్రెస్ పార్టీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది.
కానీ ఆయన మాత్రం వెనక్కి తగ్గే పరిస్థితులు కనిపించడం లేదు. అంతేకాదు.. ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ పై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
“వాడు కామారెడ్డి పోయి పోటీ చేయొచ్చు.. వీడు కరీంనగర్ నుండి హుస్నాబాద్ పోయి పోటీ చేయొచ్చా..? అక్కడ నాన్ లోకల్ అనే అంశం అడ్డం రాలేదా..?” అని తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.
రేవంత్ రెడ్డి మల్కాజ్ గిరిలో ఎంపీగా పోటీ చేసినప్పుడు, కామారెడ్డిలో ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు రాని నాన్ లోక్ సమస్య.. జూబ్లీహిల్స్ లో ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు.
తాను పార్టీ వర్కింగ్ ప్రెసిండెంట్ కాబట్టి ఎక్కడినుండైనా పోటీ చేసే హక్కు ఉందని ఆయన అన్నారు.
అంజన్ కుమార్ యాదవ్ వెనక్కి తగ్గకపోవడంతో జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందులు తప్పేలా లేవు. యాదవ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం, హైదరాబాద్ పరిధిలో మంచి పట్టున్న నాయకుడు కావడంతో.. ఆయన తిరుగుబాటుతో కాంగ్రెస్ కు ఎదురుదెబ్బలు తప్పేలా లేవు.
..
Read Also :

