Flour mill : ప్రజల వద్దకే పిండి గిర్నీ..! వాట్ ఆన్ ఐడియా సర్ జీ….?

bihar Flour mill bike

Flour mill : సాధారణంగా మనం ఇళ్లలో చపాతీ చేసుకోవడానికి, రకరకాల పిండివంటల కోసం పిండి వాడుతూ ఉంటాం. దాని కోసం పిండి గిర్నీ/మర ఆడించే దుకాణం దాకా వెళ్లాల్సి వస్తుంది.

కాస్త పెద్ద గ్రామాల్లో ఇలాంటివి అందుబాటులో ఉంటాయి. కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఉండవు. వారు ఇతర గ్రామాలకు వెళ్లాల్సి వస్తుంది. అక్కడికి వెళితే ఎక్కువ మందిఉండటం.. ఆలస్యం అవడం వంటివి రెగ్యులర్ గా జరిగిపోతుంటాయి.

Read Also : అమ్రపాలి ఇంకా ఏపీలోనే..!

అయితే ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టాడు ఓ వ్యక్తి.

బిహార్ కు చెందిన ఓ వ్యక్తి వినూత్నంగా ఆలోచించాడు. ప్రజలు పిండి మర ఆడించుకోవడం కోసం తన దాకా రావడం ఎందుకు అనుకున్నాడు. అందుకే ఏకంగా తన టీవీఎస్ ఎక్సెస్ బండిని మర ఆడించే దుకాణంగా మార్చేశాడు. వెనకసీటుభాగంలో ఓ వైపుపిండి మర.. మరోవైపు జనరేటర్ ఏర్పాటు చేసుకున్నాడు.

బండిపై ఊరూరుకు తిరుగుడూ పిండి మర ఆడించి ఇస్తున్నాడు. అంతేకాదు తాను కొన్నిరకాల ధాన్యాలు కూడా తన వెంట తీసుకెళ్తాడు. కావాల్సిన వారికి అక్కడే బరువు తూచి.. పిండి మర ఆడించి ఇస్తున్నాడు.

ఇతని ఆలోచన చూసి అంతా సూపర్ అంటున్నారు.