Green Card : అమెరికా వెళ్లాలనుకుంటున్న వారికి భారీ షాక్..!

Green Card

Green Card : అమెరికాలో వీసాలు, గ్రీన్ కార్డ్ విధానాల్లో భారీ మార్పులు రాబోతున్నాయి. హెచ్‌-1బీ (H-1B) వీసా, గ్రీన్ కార్డ్ నియమాలను పూర్తిగా మార్చేందుకు యూఎస్‌ వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ సంచలన నిర్ణయం ప్రకటించారు.
ప్రస్తుత గ్రీన్ కార్డ్ వ్యవస్థ పెద్ద ఎత్తున అవకతవకలకు వేదికైందని ఆయన విమర్శించారు.

ఒక కార్యక్రమంలో మాట్లాడిన లుట్నిక్.. “ప్రస్తుతం అమల్లో ఉన్న లాటరీ విధానాన్ని రద్దు చేస్తాం. ఇకపై కేవలం నైపుణ్యం, వేతనం ఆధారంగా మాత్రమే వీసాలు జారీ చేస్తాం” అని స్పష్టం చేశారు.
ప్రస్తుత H-1B వీసా వ్యవస్థ వల్ల అమెరికన్ ఉద్యోగాలు విదేశీ కార్మికుల చేతిలోకి వెళ్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
“మా ప్రథమ కర్తవ్యం అమెరికన్ పౌరులకు ఉద్యోగాలను కల్పించడమే. గ్రీన్ కార్డ్ వ్యవస్థలోనూ అనేక లోపాలు ఉన్నందున దానిని కూడా సవరించబోతున్నాం” అని వెల్లడించారు.

అమెరికాకు వెళ్లాలని కలలుకంటున్న భారతీయులు, ఇతర దేశాల యువతకు ఈ మార్పులు పెద్ద షాక్‌గా మారనున్నాయి.

Read Also :