Trump Jelenski meeting : ట్రంప్ తో జెలెన్ స్కీ.. టెన్షన్ లో పుతిన్..!

Trump jelenski meeting : అమెరికా మాజీ అధ్యక్షుడు (Donald trump) డొనాల్డ్ ట్రంప్‌ తో ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లోదిమిర్ జెలెన్స్కీ కీలక భేటీ జరిగింది  ఈ సమావేశంలో జెలెన్స్కీ, సుమారు $100 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయం కోసం అభ్యర్థించినట్టు సమాచారం.

ఈ నిధులను యూరప్ ఫండ్స్ సహకారంతో అమెరికా నుండి ఆధునిక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, డ్రోన్లు కొనుగోలు చేయడానికి ఉపయోగించనున్నట్టు జెలెన్స్కీ(jelenski) తెలిపారు. రష్యాతో జరుగుతున్న యుద్ధం ముగిసిన తర్వాత ఉక్రెయిన్ భద్రతకు అమెరికా దీర్ఘకాల హామీ ఇవ్వాలని ఆయన కోరారు.

జెలెన్స్కీ సూట్‌పై నవ్వుల వర్షం

వైట్‌ హౌస్‌లో జరిగిన ఈ భేటీ సందర్భంగా ఒక ఆసక్తికర ఘట్టం చోటుచేసుకుంది. ఓ రిపోర్టర్ జెలెన్స్కీ ధరించిన బ్లాక్ జాకెట్ సూట్ చాలా బాగుందని ప్రశంసించారు. వెంటనే ట్రంప్ కూడా “నాకూ అదే అనిపించింది” అంటూ జోక్యం చేసుకున్నారు. దీంతో అక్కడ నవ్వులు వెల్లువెత్తాయి.

యూరియాపై నిజం చెప్పిన మంత్రి తుమ్మల..!

ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గమనించదగ్గ విషయం ఏమిటంటే, ఇదే రిపోర్టర్ గతంలో జెలెన్స్కీ సూట్ లేకుండా వైట్‌హౌస్‌కు రావడంపై విమర్శలు చేసిన సంగతి.

ఈ సాయం ఒప్పందం తుది దశకు చేరితే, ఉక్రెయిన్‌కు అమెరికా అందించే అతిపెద్ద ఆర్థిక ప్యాకేజీలలో ఇదొకటిగా నిలుస్తుంది. ఇది తూర్పు యూరప్‌లో శక్తి సమీకరణలను ప్రభావితం చేసే అవకాశముంది.