Love: అనే ప్రముఖ అంతర్జాతీయ కంపెనీలో పెద్ద పరిణామం జరిగింది. ఆ కంపెనీ సీఈవో లారెంట్ ఫ్రీక్సే (Laurent Freixe)ను ఉద్యోగం నుంచి తొలగించారు. కారణం ఏమిటంటే, ఆయన తన సబార్డినేట్ (తన కింద పనిచేసే ఉద్యోగి)తో ప్రేమ సంబంధం కొనసాగించారని దర్యాప్తులో తేలింది.
కంపెనీ ఒక ప్రకటన విడుదల చేసింది. అందులో, ఫ్రీక్సే తన సబార్డినేట్‌తో రహస్యంగా ప్రేమ వ్యవహారం నడిపారని చెప్పింది. ఇది నెస్లే నిబంధనలకు విరుద్ధమని స్పష్టంచేసింది. కంపెనీకి ఉన్న విలువలు, నియమాలు చాలా ముఖ్యమైనవని, వాటిని ఎవరూ అతిక్రమించరాదని ఆ ప్రకటనలో పేర్కొంది. అందుకే ఆయనను వెంటనే ఉద్యోగం నుంచి తొలగించామని తెలిపింది.
ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. కంపెనీ ఛైర్మన్ పాల్ బుల్కే (Paul Bulcke), ప్రధాన స్వతంత్ర డైరెక్టర్ పాబ్లో ఇస్లా (Pablo Isla) నేతృత్వంలో దర్యాప్తు జరుగుతోందని నెస్లే తెలిపింది. పాల్ బుల్కే మాట్లాడుతూ, “మా కంపెనీ విలువలు, నిబంధనలే మా బలమైన పునాదులు. వాటిని ఎవరైనా అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకోవడం తప్పనిసరి” అని వ్యాఖ్యానించారు.
లారెంట్ ఫ్రీక్సే తొలగింపుతో ఖాళీ అయిన సీఈవో స్థానాన్ని కంపెనీ త్వరగా భర్తీ చేసింది. కొత్త సీఈవోగా ఫిలిప్ నవ్రాటిన్ (Philipp Navratil) బాధ్యతలు చేపట్టారు. ఆయన 2001లో నెస్లేలో అంతర్గత ఆడిటర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత అనేక కీలక విభాగాల్లో పని చేశారు. తన కృషి, నిబద్ధతతో మంచి గుర్తింపు పొందారు. అందుకే ఇప్పుడు ఆయనను సీఈవోగా ఎంపిక చేసినట్లు నెస్లే వెల్లడించింది.
Read Also : కవిత కొత్త పార్టీ ఎప్పుడంటే..?
ఈ సంఘటన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పెద్ద కంపెనీల్లో ఉన్నత స్థాయిలో పనిచేసే వాళ్లు కూడా క్రమశిక్షణ, నిబంధనలను కచ్చితంగా పాటించాల్సిందే అని ఈ ఘటన మరోసారి రుజువు చేసింది.

