Neeraj Chopra : డైమండ్‌ లీగ్‌ జ్యూరిక్‌ బరిలో నీరజ్‌ చోప్రా..!

Neeraj Chopra

Neeraj Chopra : భారత ఒలింపిక్‌ స్వర్ణ విజేత నీరజ్‌ చోప్రా మరోసారి జ్యూరిక్‌లో మెరిసేందుకు సిద్ధమయ్యాడు.

వచ్చే గురువారం జరిగే డైమండ్‌ లీగ్‌ ఫైనల్‌ 2025లో పురుషుల జావెలిన్‌ త్రో ఫైనల్లో ఆయన పోటీపడనున్నాడు.

27 ఏళ్ల నీరజ్‌ 2022లో ఇదే జ్యూరిక్‌ లెట్జిగ్రాండ్‌ స్టేడియంలో తన తొలి డైమండ్‌ లీగ్‌ ట్రోఫీని గెలుచుకున్నాడు.

మళ్లీ అదే వేదికపై టైటిల్‌ను తిరిగి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు.

డైమండ్‌ లీగ్‌ ఫైనల్‌ బుధవారం ప్రారంభం కానుండగా, జావెలిన్‌ త్రో ఈవెంట్‌ గురువారం జరగనుంది.