West Bengal : ఇటీవలి కాలంలో పెళ్లి తర్వాత ప్రేమ వ్యవహారాలు పెరిగిపోయాయి. భర్త ఉండగా మరో వ్యక్తితో వెళ్లిపోవడాలు.. వారిని అంతం చేయడాలు చూస్తూనే ఉన్నాం.
అయితే వెస్ట్ బెంగాల్ లో ఆసక్తికర ఘటన జరిగింది. ఉత్తర 24 పరగణాల జిల్లా బాగ్డా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ విచిత్ర ఘటన జరిగింది.
ఇద్దరు తోటికోడళ్లు.. తమ ఎదురింటి వ్యక్తితో లేచిపోయారు. మలిడా అనే గ్రామానికి చెందిన కుల్చన్ మల్లిక్, నజ్మా మండల్ ఈ పనిచేశారు.
మలిడా గ్రామానికి చెందిన యాసిన్ షేక్, అనిసూర్ షేక్ సోదరులు. యాసిన్ భార్య కుల్చన్ మల్లిక్, అనిసూర్ భార్య నజ్మా మండల్.
వీరిద్దరు తమ ఎదురింట్లో ఉంటున్న ఆరిఫ్ తో వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. కొద్దిరోజులు ఒకరికి తెలియకుండా మరొకరు.. తోటికోడళ్లిద్దరు వ్యవహారం నడిపించారు. కానీ ఆ తర్వాత ఈ ట్రయాంగిల్ ఎఫైర్ తెలిసిపోయింది.
అయినా కూడా వీరి సంబంధాన్ని అలాగే కొనసాగించారు. పెద్దలు మందలించినా తీరు మార్చుకోలేదు. ఈ సోమవారం రోజున భర్తలు బయటకు వెళ్లాక.. అత్తా మామ, పిల్లలకు మత్తు మందు ఇచ్చారు.
Read Also : ఈ సిన్మాకు వెళ్లాలంటే కడుపునొప్పి ట్యాబ్లెట్ ఉండాల్సిందే..!
వారు నిద్రలోకి జారుకున్నాక ఆరిఫ్ తో జంప్ అయ్యారు.
విషయం తెలుసుకున్న వారి భర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు వాళ్లను వెతికి పట్టుకుని తీసుకొచ్చారు. కౌన్సిలింగ్ ఇచ్చి వారి భర్తలతోనే పంపే ప్రయత్నం చేస్తున్నారు.
అయితే.. భార్యలు లేచిపోయారనే బాధకంటే.. తమ ప్రాణాలు తీయలేదనే సంతోషం వారిలో ఎక్కువగా ఉందట. ఇతరులను ఇన్సిపిరేషన్ గా తీసుకుని ఉంటే తమ ప్రాణాలు పోయి ఉండేవని అంటున్నారట.
వాళ్లంతట వాళ్లు తమను ఏమీ చేయకుండా వెళ్లిపోయారు కాబట్టి తాము కాస్త సంతోషంగా ఉన్నామంటున్నారు.
…….

