ATHER : భారతదేశ ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీదారు ఏథర్ ఎనర్జీ తన మూడవ ఏథర్ కమ్యూనిటీ డేలో నూతన ఉత్పత్తులు, సాంకేతిక అప్‌డేట్‌లను ఆవిష్కరించింది. ఇందులో ప్రధాన ఆకర్షణగా తదుపరి తరం EL ప్లాట్‌ఫామ్” ప్రకటించింది.
ఇది 450 సిరీస్ తరువాత ఏథర్ రూపొందించిన మొదటి వాహన నిర్మాణం. ఈ ప్లాట్‌ఫామ్ బహుముఖ ప్రజ్ఞ, స్కేలబిలిటీ, ఖర్చు నియంత్రణ లక్షణాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించబడింది. భవిష్యత్‌లో ఏథర్ కొత్త మోడళ్లకు ఇది ఆధారమవుతుంది.
EL ప్లాట్‌ఫామ్ కొత్త ఛాసిస్, పవర్‌ట్రెయిన్, రీడిజైన్ చేసిన ఎలక్ట్రానిక్స్‌తో అభివృద్ధి చేయబడింది. ఇది రైడర్‌లకు మెరుగైన భద్రత, సౌలభ్యం, తక్కువ నిర్వహణ ఖర్చును అందిస్తుంది. ఇందులో 2X వేగవంతమైన సర్వీస్, 10,000 కి.మీ. వరకు సర్వీస్ ఇంటర్వెల్ ప్రత్యేకతలు. అడ్వాన్స్‌డ్ ఎలక్ట్రానిక్ బ్రేకింగ్ సిస్టమ్ (AEBS), కొత్త ఛార్జ్ డ్రైవ్ కంట్రోలర్ లాంటి సదుపాయాలు కూడా ఉన్నాయి.
ఏథర్ తన AtherStack™ 7.0ను విడుదల చేసింది. ఇందులో వాయిస్ ఆధారిత ఇంటరాక్షన్, టైర్ ప్రెజర్ అలర్ట్స్, లైవ్ లొకేషన్ షేర్ వంటి స్మార్ట్ ఫీచర్లు ఉన్నాయి. పోథోల్ అలర్ట్స్, క్రాష్ అలర్ట్స్, పార్క్‌సేఫ్™, లాక్‌సేఫ్™ ఫీచర్లు రైడర్ భద్రత, వాహన భద్రతను పెంచుతాయి. OTA అప్‌డేట్‌ల ద్వారా ఈ ఫీచర్లు అన్ని ప్రస్తుత వినియోగదారులకు అందుబాటులోకి వస్తాయి.
రిజ్టా Z స్కూటర్ ఇప్పుడు టచ్‌స్క్రీన్ డాష్‌బోర్డ్, కొత్త టెర్రకోటా రెడ్ కలర్, ఎకో రైడింగ్ మోడ్‌తో అందుబాటులోకి వచ్చింది. అలాగే ఇన్ఫినిట్ క్రూయిజ్™ అనే అధునాతన క్రూయిజ్ కంట్రోల్ సిస్టమ్‌ను ఏథర్ 450 అపెక్స్‌లో ప్రవేశపెట్టింది. ఇది సిటీక్రూయిజ్, హిల్ కంట్రోల్, క్రాల్ కంట్రోల్ మోడ్‌లను అందిస్తుంది.
అదనంగా, కొత్త 6 kW ఫాస్ట్ ఛార్జర్ను ఆవిష్కరించింది. ఇది ప్రస్తుత ఛార్జర్ కంటే సగం సైజులో ఉండి, రెట్టింపు ఛార్జింగ్ వేగంని అందిస్తుంది. కేవలం 10 నిమిషాల్లో 30 కి.మీ. రేంజ్ చేరుకోవచ్చు.
ఏథర్ సహ వ్యవస్థాపకుడు & CEO తరుణ్ మెహతా మాట్లాడుతూ, “EL ప్లాట్‌ఫామ్ మా తదుపరి వృద్ధి దశకు పునాది వేస్తుంది. ఇది ఏథర్ ఆవిష్కరణలకు కొత్త దిశ చూపుతుంది” అన్నారు
Read Also :

