TRUMP : భారత్ ను మరో భారీ దెబ్బ కొట్టిన ట్రంప్..!

BREAKING NEWS-02-BATUKAMMA.COM

TRUMP : డాలర్ డ్రీమ్స్ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి నీళ్లు చల్లారు. ఇక్కడ చదువుకుని అమెరికా వెళ్లి సెటిల్ అవ్వాలని అనుకున్న వారికి భారీ షాక్ ఇచ్చారు.

ఇప్పటికే ఇండియాపై 50 శాతం సుంకాలతో తన ప్రతీకారం తీర్చుకుంటున్న ట్రంప్. ఇప్పుడు మన యువత భవిష్యత్ పైగా దెబ్బకొట్టారు.

H-1B వీసాల ధరను భారీగా పెంచేశారు. గతంలో ఎన్నడూ లేనంతగా రేట్లు పెంచేశారు. H-1B వీసా దరఖాస్తు రుసుము లక్ష డాలర్లకు పెంచుతూ ట్రంప్ సర్కారు(TRUMP) నిర్ణయం తీసుకుంది. ట్రంప్ నిర్ణయంతో ఇతర దేశాలకంటేకూడా భారత్ పైనే ఎక్కువగా ప్రభావం పడనుంది.

హెచ్ 1బీ వీసాల్లో దాదాపు 71 శాతం భారతీయులే ఉంటారు. కేవలం 11.7 శాతం చైనా వాళ్లు ఉంటారు. మిగతా దేశాలు చాలా తక్కువ శాతం ఉంటాయి.

దీంతో భారతీయులకు భారీ ఎదురుదెబ్బ తగిలినట్టయ్యింది. అయితే లోకల్ నినాదంలో భాగంగానే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.

ఎన్నికల సమయంలో కూడా తాను అదే నినాదంతో  డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ప్రచారం చేశారు. అమెరికన్లకు ప్రాధాన్యత ఉంటుందని ఆనాడు చెప్పారు. ఇప్పుడు దానికి అనుగుణంగా విదేశీయులను అమెరికా  నుండి తరిమేసేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు.

హెచ్ 1 బీ వీసాల విషయంలో అమెరికాలోని కంపెనీలకు చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మీకు ఉద్యోగులు కావాలంటే అమెరికాలో ఉన్న ప్రఖ్యాత యూనివర్సిటీల నుండి వేలాది మంది గ్రాడ్యుయేట్ అవుతున్నారు. వారికి శిక్షణ ఇచ్చి ఉద్యోగాల్లోకి తీసుకోవాలని సూచించారు.

అలా కాకుండా బయటి దేశాల నుండి ఉద్యోగులను తీసుకురావడం ఆపేయాలని హెచ్చరించారు. ఒకవేళ బయటి నుండి ఉద్యోగులను తీసుకొస్తే ఒక్కో వీసాకు లక్ష డాలర్లు కట్టాలని ఆదేశించారు. అది కూడా ఏడాది వాలిడిటీతోనే ఉంటుందని ట్రంప్ ప్రకటించారు.

ప్రతీ ఏటా డబ్బులు కట్టి రెన్యువల్ చేయించుకోవాలన్నారు. దీంతో అమెరికాలోని కంపెనీల్లో పనిచేస్తున్న విదేశీయులకు, కంపెనీలకు టెన్షన్ పట్టుకుంది.

Read Also :