Tomato flu : టొమాటో ఫ్లూ ఏమిటి? లక్షణాలు, చికిత్స, జాగ్రత్తలు

tomato virus

Tomato flu : కరోనా మహమ్మారి ఇంకా పూర్తిగా తగ్గకముందే, మరో కొత్త వైరల్ వ్యాధి టొమాటో ఫ్లూ (టొమాటో జ్వరం) కేరళలో బయటపడింది. మొదట కొల్లం జిల్లాలో గుర్తించబడిన ఈ వ్యాధి ఇప్పటివరకు ఐదేళ్లలోపు చిన్నారులను ఎక్కువగా ప్రభావితం చేస్తోంది.

అధికారుల సమాచారం ప్రకారం, జూలై 2022 నాటికి కేరళలో 82 మంది పిల్లల్లో ఈ జ్వరం నమోదు అయింది. ఒడిశాలో కూడా కొన్ని కేసులు బయటపడ్డాయి. ప్రస్తుతం తమిళనాడు, కర్ణాటకలోనూ అలర్ట్ జారీ చేశారు.

లక్షణాలు

వైద్యుల ప్రకారం, టొమాటో ఫ్లూ లక్షణాలు డెంగ్యూ, చికున్‌గున్యా లాంటివిగానే ఉంటాయి.

అధిక జ్వరం

శరీరంపై ఎర్రని బుడగలు (టొమాటో లాంటి ఆకారం)

కీళ్ల నొప్పులు, వాపు

చర్మం మీద దద్దుర్లు, గజ్జి

అలసట, వాంతులు, విరేచనాలు

ప్రాణాంతకం కాదు కానీ జాగ్రత్త అవసరం

టొమాటో ఫ్లూ ప్రాణాంతకం కాదు. కానీ ఇది చిన్నారుల్లో వేగంగా వ్యాపించే అవకాశం ఉన్నందున జాగ్రత్తలు తప్పనిసరి.

చికిత్స

ఈ జ్వరానికి ప్రత్యేక మందు లేదా టీకా లేవు.

పిల్లలను 5–7 రోజులు ఐసోలేషన్‌లో ఉంచాలి

విశ్రాంతి ఇవ్వాలి

నీరు, ద్రవాలు ఎక్కువగా తాగించాలి

జ్వరానికి పారాసెటమాల్ వాడాలి

ప్రివెన్షన్

పరిశుభ్రత పాటించడం అత్యంత ముఖ్యమైనది

పిల్లలు బొమ్మలు, బట్టలు, ఆహారం పంచుకోవద్దు

నాప్‌కిన్ వాడే చిన్నారుల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి

టొమాటో ఫ్లూ చిన్నారులకు పెద్ద ప్రమాదం కాకపోయినా, వేగంగా వ్యాపించే లక్షణం కలిగివుండటంతో ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. ప్రజలు కూడా పరిశుభ్రత పాటించి జాగ్రత్తలు తీసుకుంటే ఈ వ్యాధిని సులభంగా నియంత్రించవచ్చు.

Read Also :