చాలామందికి తేలికైన పనులతో ఆరోగ్యం బాగుపడాలనే ఆలోచన ఉంటుంది. రకరకాల కషాయాలు, గ్రీన్ టీలు తాగలేము బాబోయ్ అంటుంటారు.
అలాంటి వారికి ఓ అద్భుతమైన ఔషధం జీలకర్ర నీరు.
జీలకర్ర నీరు (Cumin Water) తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది.
ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో లేదా రాత్రి పడుకునే ముందు తాగితే అనేక ప్రయోజనాలు కలుగుతాయి.
జీలకర్ర నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు..
1.జీర్ణక్రియకు మేలు – జీలకర్రలోని ఎంజైములు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి, అజీర్ణం, కడుపు ఉబ్బరం తగ్గిస్తాయి.
2.బరువు తగ్గడంలో సహాయం – శరీరంలో ఫ్యాట్ మెటబాలిజాన్ని పెంచి, కొవ్వు కరిగేందుకు దోహదం చేస్తుంది.
Read Also : ఈ కొత్త హీరోయిన్ మీకు తెలుసా.?
3.రోగనిరోధక శక్తి పెరుగుతుంది – యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఐరన్ ఉండటంతో ఇమ్యూనిటీ పెరుగుతుంది.

4.చర్మ ఆరోగ్యం – టాక్సిన్లు బయటికి పంపి చర్మం కాంతివంతంగా మారుతుంది.
5.రక్తపోటు నియంత్రణ – పొటాషియం సమృద్ధిగా ఉండటంతో రక్తపోటును సమతుల్యం చేస్తుంది.
6.రక్తంలో చక్కెర నియంత్రణ – డయాబెటీస్ ఉన్న వారికి బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ చేయడంలో సహాయపడుతుంది.
Read Also :
7.మాసిక సమస్యలు తగ్గిస్తాయి – జీలకర్ర నీరు హార్మోన్లను సరిచేసి పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పులు తగ్గిస్తుంది.
8.కాలేయ ఆరోగ్యం – లివర్‌ను శుభ్రపరచి, టాక్సిన్లను బయటకు పంపిస్తుంది.
9.కడుపు నొప్పులు, మలబద్ధకం తగ్గిస్తాయి – సహజ రీతిలో గ్యాస్, కడుపు సమస్యలను తగ్గిస్తుంది.
10.శక్తి ఇస్తుంది – రోజంతా శరీరానికి తేలికపాటి శక్తి, ఉల్లాసం ఇస్తుంది.
తాగే విధానం:
రాత్రి ఒక గ్లాస్ నీటిలో ఒక టీస్పూన్ జీలకర్ర వేసి నానబెట్టాలి. ఉదయం ఆ నీటిని మరిగించి గోరువెచ్చగా తాగాలి.
..

