Rahul Ramakrishna : నా వల్లే ప్రాబ్లమ్ అయితే నేనెల్లిపోతా మామా ఇక్కడ్నుంచి.. అని జాతిరత్నాలు సినిమాలో కడుపుబ్బా నవ్వించాడు రాహుల్ రామకృష్ణా. అయితే.. దాన్ని నిజజీవితంలో నిజం చేసి చూపించాడు.
తన వల్లే ప్రాబ్లమ్ అని ఎక్స్ నుండి ఎగ్జిట్ అయ్యాడు. అకౌంట్ డీ యాక్టివేట్ చేసుకుని వెళ్లిపోయాడు.
గురువారం రోజు రాహుల్ రామకృష్ణ తన ఎక్స్ అకౌంట్ లో కొన్ని పోస్టులు చేశాడు. అవే ఆయన ఎక్స్ నుండి వెళ్లిపోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చాయి.
బీఆర్ఎస్ పాలనను కీర్తిస్తూ ఆయన పోస్టులు పెట్టాడు. ప్రస్తుత ప్రభుత్వ పాలనలో హైదరాబాద్ ఆగం అయ్యిందని.. దాన్ని బాగు చేయడానికి మిమ్మల్ని ప్రజలు పిలుస్తున్నారంటూ కేసీఆర్ ను టాగ్ చేసి పోస్ట్ పెట్టాడు.
అత్యంత దుర్భర పరిస్థితుల్లో బతుకుతున్నామని.. కేటీఆర్ ను టాగ్ చేసి మరో పోస్ట్ పెట్టారు.

ఇంకేముంది.. కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మొత్తం ఆయన కామెంట్ బాక్స్ లోకి వచ్చేసింది. కాంగ్రెస్ తో పాటే బీజేపీ సోషల్ మీడియా కూడా ఆయన కామెంట్ బాక్స్ కిందకు వచ్చేసింది.
బూతులతో విరుచుకుపడింది. రెండు పార్టీల సోషల్ మీడియా టీములకు దసరా రోజు ఇదే పెద్ద టాస్క్ అయ్యింది. నాన్ స్టాప్ బూతులతో చుక్కలు చూపెట్టారు.
దీంతో సాయంత్రానికి రాహుల్ రామకృష్ణ తన ఎక్స్ అకౌంట్ ని డీ యాక్టివేట్ చేసుకుని వెళ్లిపోయాడు.

అయితే.. ఇది కేవలం కామెంట్ల వల్లే కాలేదని తెలుస్తోంది. రాహుల్ రామకృష్ణ పోస్టులు వైరల్ కావడంతో ప్రభుత్వ పెద్దలు సీరియస్ అయినట్టు సమాచారం. వారి నుండి పోలీసు ఉన్నతాధికారులకు చీవాట్లు పడ్డాయని తెలుస్తోంది.
అటు పార్టీ మనుషులు.. ఇటు పోలీసు ఉన్నతాధికారులు రామకృష్ణను బెదిరించినట్టుగా ప్రచారం జరుగుతోంది. దీంతో వారి బెదిరింపులు తట్టుకోలేకనే అకౌంట్ డీయాక్టివేట్ చేసినట్టుగా ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
అయితే.. ఈ వ్యవహారం మరోసారి కాంట్రవర్సీగా మారింది. రేవంత్ రెడ్డి సర్కారు ఎంత నిరంకుశంగా వ్యవహరిస్తోందో చెప్పడానికి ఇది మరో ఉదాహరణ అని బీఆర్ఎస్ పార్టీ అంటోంది.
గతంలో రేవంత్ రెడ్డి పేరు మరిచిపోయాడని.. అల్లు అర్జున్ ను జైలుకు పంపించారని.. ఇప్పుడు కేసీఆర్ పాలనను మెచ్చుకున్నందుకు రాహుల్ రామకృష్ణను బెదిరించారని అంటున్నారు.
.
Read Also :
- మీసాల పిల్ల పాటలో ఇవి గమనించారా.?
- న్యూయార్క్ ఎయిర్ పోర్టులో గుద్దుకున్న విమానాలు.. లైవ్ వీడియో
- తల్లి కాబోతున్న శివజ్యోతి..
- హ్యాంగోవర్ తగ్గడానికి ఇంత కంటేమంచి టిప్స్ ఎవడు చెప్పడు భయ్యా..!

