OG Movie review : ఓజీ సినిమా రివ్యూ : మొత్తం పూనకాలే…!

they call him og movie review

OG Movie review : ఓజీ సినిమాపై ఫ్యాన్స్ పెట్టుకున్న అచంనాలు నిజమవుతున్నాయి. హరిహరవీరమల్లుతో కాస్త డిసప్పాయింట్ లో ఉన్న ఫ్యాన్స్ లో ఈ మూవీ ఫుల్ జోష్ నింపింది. గూస్ బంప్స్ తెస్తోంది.

ఇవాళ రిలీజైన ఓజీ సినిమా ఎలా ఉందో.. ప్రవీణ్ అనే ఒక జర్నలిస్టు ఎంత అద్భుతంగా వర్ణించారో చూడండి.

ఇలా కదా పవన్ కళ్యాణ్ ను చూపించాలి..

ఇలా కదా పవన్ కళ్యాణ్ తో సినిమా తీయాలి..

ఇలా కదా పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద సునామీ సృష్టించాలి..

ఇది కదా పవన్ ఫ్యాన్స్ కోరుకునేది..

ఇది కదా ఆయన ఆరా అంటే.. ఇలా కదా పవన్ కళ్యాణ్ క్రేజ్ వాడాల్సింది..

పవర్ స్టార్ ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ OG.. మామూలు ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేస్తారు..

కథ పరంగా చాలా రొటీన్.. ఇంకా చెప్పాలంటే సాహో మళ్ళీ తీశాడు..

కాకపోతే అందులో చేసిన మిస్టేక్స్ ఇందులో సరిదిద్దుకున్నాడు..

రొటీన్ గ్యాంగ్ స్టర్ డ్రామాను ఎమోషనల్ గా తెరకెక్కించాడు సుజీత్..

నాకు సినిమాలో బాగా నచ్చిన విషయం సుజిత్ రాసుకున్న స్క్రీన్ ప్లే..

క్రమం తప్పకుండా ప్రతి 10 నిమిషాలకు ఒకసారి హై ఇచ్చాడు..

అది కూడా మాములు హై కాదు.. సుజిత్ రాసుకున్న సీన్లకు..

అదేదో డ్రగ్ తీసుకున్నట్టు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొట్టాడు తమన్..

ఫస్టాఫ్ అయితే ప్యూర్ మెంటల్ మాస్.. పూనకాలు వచ్చేసాయి..

ఇంటర్వెల్ సీక్వెన్స్ నెక్స్ట్ లెవెల్..

సెకండ్ హాఫ్ లో పోలీస్ స్టేషన్ సీన్ పవన్ కళ్యాణ్ క్రేజ్ కు నిదర్శనం..

అక్కడక్కడ కాస్త స్లో అయింది కానీ..

ప్రీ క్లైమాక్స్ నుంచి మళ్లీ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోయింది..

సుజీత్ రాసుకున్న ప్రతి సీన్ లో పవన్ కళ్యాణ్ మీద ఆయనకున్న ప్రేమ కనిపించింది..

తన అభిమాన హీరోని ఎలా చూపించాలి అనుకున్నాడో..

అంతకంటే 100 రెట్లు బాగా చూపించాడు..

ఒక రొటీన్ రెగ్యులర్ కథను పవన్ కళ్యాణ్ అనే పేరు చుట్టూ తిప్పేసాడు..

ఒక్కటైతే నిజం.. ఇన్నేళ్ళ కెరీర్ లో పవర్ స్టార్ ను ఇంత పవర్ ఫుల్ గా ఎవరు చూపించలేదు..

పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్ పీక్స్.. అది ప్యూర్ మ్యాజిక్..

ఇమ్రాన్ హష్మీ కూడా అదిరిపోయాడు..

శ్రియ రెడ్డి, ప్రకాష్ రాజ్ క్యారెక్టర్స్ బాగున్నాయి..

ప్రియాంక మోహన్ ఉన్నంతవరకు పర్లేదు..

తమన్ పూనకాలు పుట్టించాడు..

సుజీత్ బ్లడ్ బాత్ చేయించాడు.. తన అభిమానం కనిపించింది..

దర్శకుడిగా ఆయన మేకింగ్ మామూలుగా లేదు..

ఓవరాల్ గా OG.. it’s గంభీర టైమ్.. షో ఇప్పుడే మొదలైంది..!

Read Also :