OG : ఫ్యాన్స్ కు పిచ్చెక్కిస్తున్న OG లెటెస్ట్ వీడియో..!

OG WASHI YO WASHI video

OG : పవన్ కల్యాణ్ తన ఫ్యాన్స్ కు వరుసగా ఫీస్ట్ ఇస్తున్నారు. చాలా గ్యాప్ తర్వాత హరిహర వీరమల్లుతో ఫ్యాన్స్ కు కాస్త ఊపునిచ్చారు. ఆ వెంటనే  OG తో మరో జోష్ తీసుకొచ్చారు.

అయితే ఇప్పుడు ఓజీ మానియా మామూలుగా లేదు. ఫ్యాన్స్ అంతా అల్లాడిపోతున్నారు. సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్లకు వస్తుందా.? ఎప్పుడెప్పుడు చూసేద్దామా అని వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

ఇదే సమయంలో వశి ఓ వశి… అంటూ ఓ వీడియోను రిలీజ్ చేశారు. పూర్తిగా పవన్ కల్యాణ్ (pawan kalyan)డైలాగ్ లతో నడిచే ఈ వీడియో యూట్యూబ్ ను, సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

ఇప్పటికే ఉత్కంఠతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఫ్యాన్స్.. ఈ వీడియో చూశాక ఇక ఆగలేకపోతున్నారు. ఎప్పుడెప్పుడు థియేటర్లకు పరుగెడదామా అని పనులన్నీ పక్కనపెట్టి మరీ కూర్చున్నారు.

యూట్యూబ్ లో వీడియో అప్ లోడ్ చేసి 12 గంటలు గడవకముందే 1 మిలియన్ వ్యూస్ దాటిపోయింది. ఇక దాన్ని డౌన్ లోడ్ చేసి సోషల్ మీడియాలో పెట్టిన వాళ్లు లక్షల్లో ఉన్నారు.

Read Also :