OG MOVIE : పవన్ కల్యాన్ నటించిన ఓజీ మూవీ ఫీవర్ ప్రపంచాన్ని పట్టేసింది. ఇండియా టూ అమెరికా ఎక్కడ చూసినా ఇదే ఫీవర్ కనిపిస్తోంది.
ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో యూత్.. సినిమా ఎప్పుడెప్పుడొస్తుందా అని పిచ్చెక్కి పోతున్నారు. రెండు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ లో ఓ యువకుడు రూ.1లక్ష పెట్టి మరీ టికెట్ కొన్నాడు. అంటే పవన్ (Pawan kalyan)ఎఫెక్ట్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
నటుడు సిద్ధు జొన్నలగడ్డ(Sidhu jonnalagadda) కూడా దీనిపై ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. ఈ హైప్ చూస్తే సినిమా రిలీజ్ అయ్యేదాకా ఉంటానో లేదో లేదోనని ఆయన అన్నారు. చాలామంది సెలబ్రిటీలది ఇదే పరిస్థితి.
సెలబ్రిటీలే కాదు.. కామన్ పీపుల్ కూడా ఓజీ మూవీ టికెట్స్ కోసం ఎగబడ్డారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని ఏ థియేటర్ లో కూడా టికెట్లు దొరకని పరిస్థితి. నాలుగు రోజులు ముందుగానే టికెట్లు మొత్తం సేల్ అయిపోయాయి.

రెండు మూడు రోజుల వరకు టికెట్ కొందామన్న కొనలేని పరిస్థితి. థియేటర్లకు వెళ్లితే రిలీజ్ కు ముందే హౌజ్ ఫుల్ బోర్డులు పెట్టేస్తున్నారు.
ఇంత మందిని తట్టుకోలేక అల్లాడిపోతున్న బుక్ మై షో..!
దీంతో అంతా బుక్ మై షో.. పై పడుతున్నారు. పాపం ఇంతమంది ఒకేసారి టికెట్ల కోసం దానిపై పడే సరికి వెబ్ సైట్ క్రాష్ అయ్యే పరిస్థితి వచ్చిందట. దీంతో బుక్ మై షో (Book my show)నిర్వాహకులు.. తమ టెక్నికల్ టీంను అలర్ట్ గా ఉండాలని చెప్పారట.
వెబ్ సైట్ కి విజిటర్స్ సంఖ్య పెరిగిపోతుండటంతో.. ఏ క్షణంలో అయినా వెబ్ సైట్ కుప్పకూలే పరిస్థితి ఉందని ఆందోళన పడుతున్నారట.

ఇక మరికొందరైతే బుక్ మై షోలో దొరక్కపోయే సరికి మళ్లీ థియేటర్ల దగ్గర చక్కర్లు కొడుతున్నారు. కనీసం బ్లాక్ లో అయినా టికెట్లు దొరకబట్టుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు.
ఎంత రేట్ అయినా ఫర్వాలేదు. పవన్ కల్యాణ్ ఓజీ సినిమా(OG MOVIE) ఫస్ట్ డే.. ఫస్ట్ షో చూడాల్సిందేనని చాలా మంది పట్టుబట్టి కూర్చున్నారు.

మల్టీప్లెక్సులే కాదు.. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో కూడా టికెట్లు దొరకడం లేదని ఫ్యాన్స్ గగ్గోలు పెడుతున్నారు.
ఫస్ట్ డే కాకపోతే సెకండ్ డే అయినా వెళ్లొచ్చు కదా అని కొందరు అనుకున్నారు. కానీ ఇప్పుడున్న హైప్, బుక్ మై షో లాంటి టికెట్ బుకింగ్ యాప్స్ లో పరిస్థితి చూస్తే వారం రోజుల దాకా టికెట్లు దొరకడం కష్టమే అంటున్నారు.
పాపం.. ఫ్యాన్స్ పరిస్థితి ఏంటో ఏమో.
అటు బుక్ మై షో యాప్ క్రాష్ కాకుండా ఉండాలని ఫ్యాన్స్ అంతా దేవుడిని మొక్కుకోండి. లేకపోతే ఆ వారం రోజుల తర్వాత కోసం కూడా టికెట్లు బుక్ చేసుకోలేని పరిస్థితి వచ్చింది.
Read Also :
- రేవంత్ రెడ్డి ఇంత మోసం చేస్తవనుకోలే.. డీఎస్పీ నళిని మరణ వాంగ్మూలం
- కాంగ్రెస్ సర్కారు మూడేండ్లే.. కాడి ఎత్తేసిన ముఖ్యమంత్రి మంత్రులు..!
- తొక్కుకుంటూ పోతా.. ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు
- నేను బతుకుతానో లేదో… డీజే టిల్లు సంచలన పోస్ట్..!
- ఫ్యాన్స్ కు పిచ్చెక్కిస్తున్న OG వీడియో

