Actress Raasi : సినిమా ఇండస్ట్రీలో చాలామంది డైరెక్టర్లు హీరోహీరోయిన్లకు కథ, పాత్రల గురించి ముందు ఒకలా చెప్పి, తీరా షూటింగ్ సమయానికి ఇంకోలా తీసే దర్శకులు చాలా మంది ఉన్నారు. ఇలాంటి సంఘటన సీనియర్ హీరోయిన్ రాశి కెరీర్ లో ఒకటి జరిగింది. ఇటీవల ఆమె ఒక యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో తనకు జరిగిన చేదు అనుభవం బయట పెట్టింది.

మహేష్ బాబు హీరోగా వచ్చిన నిజం సినిమా కోసం తనని తేజ ఆఫీసుకి పిలిపించి మాట్లాడారని చెప్పింది రాశి. ఆయన తన పాత్రను గురించి చెప్పారని, నెగిటివ్ పాత్ర అని చెప్పారని, గోపీచంద్, తనకు మధ్య మహేష్ బాబు వస్తారని చెప్పారంది.

ఈ పాత్ర కోసం తాను కాస్త బరువు తగ్గాలని చెప్పి ట్రైనర్ ని కూడా పెట్టారంది. ఎలాంటి మేకప్ లేకుండా తాను ఆ సినిమాను చేశానని రాశి తెలిపారు.
మొదటి రోజే చేయకూడని సీన్ ను షూట్ చేశారని, ఈ సీన్ గురించి తనకు ముందుగా చెప్పలేదు కనుక తాను ఈ సినిమా చేయనని చెప్పానన్నారు.

కానీ తన పీఏ బాబురావు నచ్చజెప్పడంతో అయిష్టంగానే ఆ సినిమా చేశానన్నారు రాశి . ఆ తరువాత డబ్బింగ్ చెప్పాక తేజ సారీ చెప్పినా, తాను దానిని అంగీకరించనని తెలిపారు.

“ఆ పాత్ర చేస్తే తన ఇమేజ్ దెబ్బతింటుందని తనకు అనిపించిందని, తన ఫ్యాన్స్ హర్ట్ అవుతారని, అనుకున్నట్టుగానే జరిగిందన్నారు. ఆ సినిమా తరువాత తన కెరియర్ పోయిందని రాశి ఆవేదన వ్యక్తం చేశారు.
మొన్నీ మధ్య ఓ ఇంటర్వ్యూలో ఒకరు అడిగితే… ఇండస్ట్రీలో ఏ దర్శకుడినైనా మరిచిపోవాలని అనుకుంటే అప్పుడు వాళ్లకి తాను తేజ పేరు చెప్పానంది.ఆ సినిమా తరువాత తేజ సినిమాలకి కూడా తాను పనిచేశానని, లక్ష్మీ కల్యాణం సినిమాలో కాజల్ కు డబ్బింగ్ చెప్పాను అని రాశి అన్నారు.
Read Also :

