IPS Sunil Kumar : ఆంధ్రప్రదేశ్ కు చెందిన మాజీ ఐపీఎస్ అధికారి(pv sunil kumar) పీవీ సునీల్ కుమార్ సంచలన ట్వీట్ చేశారు. గత ప్రభుత్వ హాయంలో అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నారంటూ ఆయనపై టీడీపీ ఆరోపించింది. కూటమి ప్రభుత్వం రాగానే ఆయనపై కేసులు పెట్టి వేధించింది.
ఈ నేపథ్యంలో ఆయన చేసిన ట్వీట్ సంచలనంగా మారింది.
ఆయాన ఎక్స్ పోస్ట్ చేసిన మాటలు యధాతథంగా…
“భూమి బల్లపరుపుగా ఉంది. ఇది మొదటిలో ఉన్న నమ్మకం . అదే చట్టం .
పైథాగరస్, అరిస్టాటిల్ అనే వాళ్ళు భూమి గుండ్రంగా ఉంది అని సిద్ధాంతం చేసి ఆధారాలు చూపించారు . నమ్మకం , చట్టం మారాయి. మారింది భూమి కాదు. చట్టం మాత్రమే .
కానీ చట్టం చెప్పింది కాబట్టి భూమి బల్లపరుపుగా ఉండి తీరాలి , ఇంకోలా ఉంది అంటే నువ్వు చట్టాన్ని ఉల్లంఘిస్తున్నావ్ అంటే ఎలా ఎలా ఉంటుంది?
ఇప్పుడు ఇంకో ఉదాహరణ చూద్దాం. కులం అనేది ఒకప్పుడు మతం నుండి వచ్చి ఉండొచ్చు. అంటే కరోనా చైనాలో పుట్టినట్లుగా.
కానీ కులం ఇప్పుడు మతం హద్దులు దాటింది. తనను పుట్టించిన మతం నుంచి ఇతర మతాల్లోకి వ్యాపించింది.
కరోనా వైరస్ అన్ని దేశాలకు పాకిన విధంగానే
వైరస్ చైనాది అయితే నువ్వు ఎందుకు వాక్సిన్ వేసుకున్నావు? ఇపుడు కరోనా అందరిదీ
అలాగే కులం అనేది ఇప్పుడు అన్ని మతాలది…
కులం అనేది నీ ఒంటి మీద చర్మం. పుట్టినప్పటి నుండి పోయే వరకూ అలానే ఉంటుంది. మతం అనేది నువ్వు వేసుకునే సెంటు లాంటిది… కాసేపటికి పోతుంది…. ఎన్ని సెంట్లు అయినా మార్చవచ్చు… చర్మాన్ని కాదు
మతాన్ని బట్టలతో ఎందుకు పోల్చలేదు అంటే …. బట్టలు మనిషికి తప్పనిసరి … మతం కాదు …
ఇప్పుడు చెప్పండి… చట్టం చెప్పింది కాబట్టి భూమి బల్లపరుపుగా మారాలా? లేక భూమి గుండ్రంగా ఉంది కాబట్టి చట్టం మారాలా?
చట్టాలు మార్చుకోవడానికే బాబాసాహెబ్ అంబేద్కర్ మీకు ఓటు ఇచ్చింది. మరి మనం ఆ హక్కును సరిగా వాడితే 78 సంవత్సరాలు చట్టం మారకుండా ఎందుకు ఉంది?”

