Ambati Ram Babu : కూతురి పెళ్లిలో ట్రంప్ పై అంబటి జోకులు..!

Ambati rambabu daughter marriage

Ambati Ram Babu :  వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు కుమార్తె డాక్టర్ శ్రీజ వివాహం హర్షతో  అమెరికాలో హిందూ సంప్రదాయ పద్ధతిలో ఘనంగా జరిగింది. అమెరికాలోని ఇల్లినాయిస్ రాష్ట్రంలో ఉన్న మహాలక్ష్మి ఆలయంలో హిందూ సాంప్రదాయ పద్ధతిలో ఈ శుభకార్యం జరిగింది.

హర్ష స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా తణుకు.. ఆయనది కమ్మ సామాజిక వర్గం. హర్ష అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు.

శ్రీజ కూడా ఎండోక్రైనాలజిస్ట్‌గా అమెరికాలోనే పనిచేస్తున్నారు. ఈ వివాహ వేడుకకు అంబటి రాంబాబు దంపతులు,  కొద్దిమంది సన్నిహిత బంధువులు, స్నేహితులు మాత్రమే హాజరయ్యారు. వరుడి కుటుంబ సభ్యులు వీసా ప్రాబ్లమ్ వలన హాజరు కాలేకపోయారు.

ఇండియా నుంచి చాలా మంది స్నేహితులు, బంధువులు వర్చువల్‌గా  హాజరై తమ ఆశీస్సులను అందించారు. వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

అంబటి రాంబాబు అక్కడి నుంచి ఓ వీడియోలో మాట్లాడుతూ.. తమ కుమార్తె వివాహం ఆంధ్రప్రదేశ్‌ లోనే జరగాల్సి ఉందన్నారు. కానీ  మ‌ళ్లీ ఇండియాకు వ‌స్తే ట్రంప్ తిరిగి రానిచ్చే అవ‌కాశం లేదంటూ అంబ‌టి రాంబాబు సెటైర్ వేశారు.

శ్రీజ, హర్షలది ప్రేమ వివాహం. తన కూతురు, అల్లుడు ఇండియాకు వచ్చాక గ్రాండ్ గా రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నట్లు అంబ‌టి రాంబాబు స్పష్టం చేశారు. అంబటి రాంబాబుకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. శ్రీజ పెద్ద కూతురు.

Read Also :.