AP News : శ్రీ సత్య సాయి జిల్లా సోమందేపల్లి మండలం పందిపర్తి గ్రామంలో ఓ అమానున ఘటన వెలుగుచూసింది. హరి అనే యువకుడు మౌనిక అనే యువతిని ప్రేమించానని వెంటబడ్డాడు. అయితే పెళ్లికి ముందు మౌనిక ఐదు నెలల గర్భం దాల్చడంతో అమ్మాయి తల్లిదండ్రులు హరి తల్లిదండ్రులను వివాహం కోసం సంప్రదించారు. కానీ వారు నిరాకరించడంతో, మౌనిక తల్లిదండ్రులు సోమందేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పెద్దల మధ్యస్థత్వంతో ఓ దేవాలయంలో పెళ్లి పూర్తి చేశారు. అయితే పెళ్లి తర్వాత కేవలం మూడు నెలలు గడవగానే హరి తన భార్యపై అనుమానం పెంచుకున్నాడు. భార్య గర్భానికి తానే కారణం కాదంటూ తల్లిదండ్రుల సాయంతో మౌనికను ఇంటి నుండి బయటకు గెంటేశాడు. దీంతో తనకు న్యాయం జరగాలంటూ, భర్త ఇంటి ఎదుటే మౌనిక ఆందోళనకు దిగింది.
తోడికోడలు కూడా అవమానిస్తోంది
కన్నీటి కళ్లతో మాట్లాడిన మౌనిక .. “నా భర్త తల్లిదండ్రులకు మా పెళ్లి ఇష్టం లేదు.. ఇప్పుడు నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. తోడికోడలు కూడా అవమానిస్తోంది, భర్త వారికి తోడుగా నన్ను బయటకు పంపేశాడు” అని వాపోయింది. తనపై అనుమానం ఉంటే డీఎన్ఏ టెస్ట్ కూడా తామ సిద్దమని మౌనిక అంటుంది.తమ కూతురికి న్యాయం చేయాలని బాధిత మౌనిక తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
Also Read :

