Kaleshwaram water : కూలిపాయే.. కొట్కపాయే..! నీళ్లెట్ల తెస్తరు సారూ..?

Kaleshwaram water for hyderabad drinking needs

Kaleshwaram water :

“కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది.”

“కాళేశ్వరం ప్రాజెక్టు కొట్టుకపోయింది.”

“కాళేశ్వరం ప్రాజెక్టు గంగల కలిసింది.. గోదావరిల కలిసింది.”

“లక్ష కోట్లు గోదావరిల కల్సినయ్.”

“కాళేశ్వరం ప్రాజెక్టు పేరు చెప్పి లక్ష కోట్లు దోసుకున్నరు”

ఇవి కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram project)గురించి.. కాంగ్రెస్, బీజేపీ నాయకులు, ప్రధానమంత్రి (Modi)నుంచి ప్రస్తుత ముఖ్యమంత్రి (Revanth reddy) దాకా ప్రతీ ఒక్కరు చెప్పిన మాటలు.. చెబుతున్న మాటలు.

కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్న నాటి నుంచి, కాళేశ్వరం ప్రాజెక్టుకు పునాదులు పడిన నాటి నుంచి చెబుతున్న ముచ్చట్లు ఇవే. వాళ్ల అధృష్టమో… బీఆర్ఎస్ దురదృష్టమో… లేకపోతే కుట్రనో కానీ.. ఎన్నికల ముందు మేడిగడ్డ బ్యారేజీలో మూడు పిల్లర్లు కుంగాయి.

అదే ఎన్నికల అంశం అయ్యింది. బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. 20 నెలల పాలన పూర్తి చేసుకున్నారు.

అయినా ఇప్పటికే అవే మాటలు మాట్లాడుతున్నారు. సందర్భం ఏదైనా సరే.. కాళేశ్వరం కూలిపోయింది అనే మాట తప్ప మరో మాట వారి నోట నుండి రావట్లేదు.

తానా అంటే.. తందానా అన్నట్టు.. బీజేపీ కూడా అదే మాట.

“కాళేశ్వరం” అనేది శివుడి పేరు. “కాలానికి అధిపతి” అని దాని అర్థం. గోదావరి తీరాన ఆ కాళేశ్వరుడు వెలిశాడు కాబట్టి ఆయన పేరు మీదే ఆ ప్రాంతానికి కాళేశ్వరం అనే పేరు వచ్చింది. ఆ శివుడి పేరుమీదే గత ప్రభుత్వం కాళేశ్వరం అనే పేరుతోని ప్రాజెక్టు కట్టింది.

కానీ.. తాము హిందూ మతానికి ప్రతినిధులం అని చెప్పుకునే బీజేపీ కూడా ఆ పేరును అవహేళన చేసింది. పవిత్రమైన “కాళేశ్వరం” అనే పేరును “కూలేశ్వరం” అంటూ అపహాస్యం చేసింది. అందులో కాంగ్రెస్ వాళ్లు కూడా ఉన్నారు. తెలంగాణలో మేధావులం అని చెప్పుకున్న తిరుగుతున్నోళ్లు కూడా ఉన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది.. కొట్టుకపోయిందని ఓ వైపు చెబుతూనే ఉన్నారు. మరోవైపు ప్రస్తుత అదే కాళేశ్వరం నీటిని హైదరాబాద్ తాగునీటి (Hyderabad drinking water)అవసరాలకు తీసుకొస్తున్నారు.

ఈ ప్రాజెక్టుకు సోమవారం (సెప్టెంబర్ 8,2025) రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేస్తున్నారు.

గోదావరి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ఫేజ్ 2,3 పేరుతో ఈ పనులు చేపట్టబోతున్నారు. రూ. 7,360 కోట్ల అంచనా వ్యయంతో పనులు మొదలు పెడుతున్నారు (పూర్తయ్యే వరకు అది రెండు మూడు రెట్లు పెరిగినా ఆశ్చర్యపోనవసరం లేదు).

మరి ఈ నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయి.?

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన సిద్ధిపేట జిల్లాలో ఉన్న మల్లన్న సాగర్ రిజర్వాయర్ నుండి వస్తాయి. మల్లన్న సాగర్ నుండి 20 టీఎంసీల నీటిని హైదరాబాద్ కు తరలిస్తారు. హైదరాబాద్ కు దగ్గరగా ఉన్న కొండపోచమ్మ సాగర్ కాదని… దూరంగా ఉన్న మల్లన్న సాగర్ నుండి నీళ్లు తీసుకొస్తరట. అది వేరే కాంట్రవర్సీ.

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మల్లన్న సాగర్(Mallannasagar) నుంచి నీళ్లు వచ్చి.. ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేపట్టబోతున్న మూసీ అభివృద్ధికి పథకంలోకి నీళ్లు చేరుతాయి.

వచ్చీ రాగానే పేదల ఇండ్లు కూలగొట్టి మరీ.. కమర్షియల్ కాంప్లెక్స్ లు కడతామని.. మూసీ అభివృద్ధి చేస్తామని లక్షన్నర కోట్లతో ఓ ప్రాజెక్టును ప్రకటించింది రేవంత్ రెడ్డి సర్కారు. అదే మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు. గోదావరి నీళ్లొచ్చి(Godavari River).. ఆ మూసీలో పారుతాయి.

రెండున్నర టీఎంసీల నీటిని మూసీ పునరుజ్జీవం కోసం ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ లో పోయనున్నారు. 17.5 టీఎంసీలు హైదరాబాద్ తాగునీటి అవసరాలకు వాడబోతున్నారు. మల్లన్నసాగర్ నుండి హైదరాబాద్ వచ్చే మార్గంలో పలు చెరువులను కూడా ఈ నీటితో నింపనున్నారు.

Read Also :

సీన్ కట్ చేస్తే.. ఇప్పుడు అదే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన పంపులు.. టన్నెల్లు, కాలువలు, రిజర్వాయర్లు దాటుకుంటూ వచ్చిన నీళ్లను హైదరాబాద్ తీసుకురాబోతున్నారు.

ఈ డ్రామా ఏంటీ..?

ఎవరిని పిచ్చోళ్లను చేస్తున్నారు..?

పూర్తి  వివరాలు కింది వీడియోలు చూడండి.

Read Also :