Sudarshan reddy : ఇండి కూటమి (INDI Alliance) ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డిని రాష్ట్ర మంత్రులు కలిశారు.
బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం ఏర్పాటు చేసిన మంత్రి వర్గ ఉప సంఘం నేతలు కూడా ఆయనతో భేటీ అయ్యారు.
బీసీలకు ప్రస్తుతం ఉన్న 34 శాతం రిజర్వేషన్లను 42 శాతం వరకు పెంచేలా చర్యలు తీసుకోవాలని ఉప సంఘం నేతలు జస్టిస్ రెడ్డి(sudarshan reddy) గారిని కోరారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేతలు పొన్నం ప్రభాకర్, సీతక్క, శ్రీధర్ బాబు, అలాగే నేతలు ఈరవత్రి అనిల్, వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
రిజర్వేషన్ల పెంపు విషయంలో రాజ్యాంగ పరిమితులు, న్యాయపరమైన అంశాలపై జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు సలహాలు అందించారు.
ఉప సంఘం సభ్యులు మాట్లాడుతూ బీసీ వర్గాల సాంఘిక, ఆర్థిక, రాజకీయ అభివృద్ధి కోసం రిజర్వేషన్ల పెంపు అవసరమని స్పష్టం చేశారు.
రాబోయే రోజుల్లో ఈ అంశంపై ఇండియా కూటమి బలమైన నిర్ణయం తీసుకోనుందని తెలిపారు.
Read Also :
- రాహుల్ గాంధీ పెళ్లికొడుకాయెనే
- ఉపవాసం ఇలా చేస్తే.. మీ గుండెకు డేంజర్..!
- మీ పిల్లలకు వెబ్ సిరీస్ లు చూపిస్తున్నారా.? ఈ వార్త చూడండి.
- నా తడాఖా అక్కడే చూపిస్తా..!

