Visharadan Maharaj : మార్వాడీ గో బ్యాక్ (marwadi go back) ఉద్యమంపై డీఎస్పీ పార్టీ అధినేత విశారదన్ మహారాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీ,ఎస్సీ,ఎస్టీల ఉద్యమాన్ని అణచివేసేందుకే మార్వాడీ గో బ్యాక్ ఉద్యమాన్ని తీసుకొచ్చారని ఆరోపించారు.
కాంగ్రెస్(congress), బీజేపీ(bjp), బీఆర్ఎస్(BRS).. మూడు పార్టీల కుట్ర ఇందులో ఉందని విశారదన్ మహారాజ్ (Visharadan Maharaj )అన్నారు.
“మార్వాడీలను వ్యతిరేకించే ఉద్యమాల్లో అమాయక పేద బీసీ, ఎస్సీ, ఎస్టీలను ముందుకు నెట్టేస్తున్నారన్నారు. వెనుకనుండి కోమటోళ్లతో డబ్బులు ఖర్చు పెట్టించే ప్రయత్నం జరుగుతోందని అన్నారు.
“నిజంగా తెలంగాణ స్థానిక వైశ్యుల వ్యాపార రక్షణకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుందా? మార్వాడీలపై గట్టి చర్యలు తీసే దమ్ముందా?” అని ప్రశ్నించారు.
బీసీ, ఎస్సీ, ఎస్టీ ఆధ్వర్యంలో పార్టీలు అధికారంలోకి వస్తే, 24 గంటల్లో ఒక లక్ష లారీలు తెప్పించి, మార్వాడీలను(Marwadi) వారి ప్రాంతాలకు తరలిస్తామన్నారు. స్థానిక తెలంగాణ వైశ్యులకు, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు వ్యాపార అవకాశాలు కల్పిస్తామని ఆయన స్పష్టం చేశారు.
“ఇప్పటివరకు కమ్యూనిస్ట్, నక్సలైట్, తెలంగాణ ఉద్యమాల్లో అమాయక బీసీ, ఎస్సీ, ఎస్టీలు బలి అయ్యారు. కానీ ఫలితం మాత్రం వారి చేతికి రాలేదు. ఈసారి మళ్లీ అదే తప్పు చేయకూడదు” అని హెచ్చరించారు.
విశారదన్ మహారాజ్ సూచనలు..
- ఉద్యమం నిజంగా ఫూలే, అంబేడ్కర్, కాన్షిరాం సిద్ధాంతాల కొనసాగింపా? కాదా? అని ముందుగా తెలుసుకోవాలి.
- ఉద్యమ ఫలితాల్లో మనకెంత వాటా వస్తుందో అంచనా వేసుకోవాలి.
మార్వాడీల వ్యాపారం వదిలిస్తే నిజంగా అవకాశాలు స్థానిక బీసీ, ఎస్సీ, ఎస్టీలకు వస్తాయా అనేది ఆలోచించాలి. - శాంతియుత ప్రజాస్వామ్య పద్ధతిలోనే ఉద్యమం నడవాలి, లేకపోతే అమాయకుల జీవితాలు కేసుల్లో ఇరుక్కుపోయే ప్రమాదం ఉందన్నారు.
మన తుది లక్ష్యం రాజ్యాధికారమే కావాలి. అధికారాన్ని బీసీ, ఎస్సీ, ఎస్టీలు స్వాధీనం చేసుకుంటేనే అన్ని వర్గాలపై నియంత్రణ సాధ్యమవుతుంది. మార్వాడీల దుకాణాలను మూయించగల శక్తి కూడా అప్పుడే వస్తుంది.. అని ఆయన అన్నారు.
అందుకే మన శక్తిని వృధా చేసుకోకుండా ఫూలే, అంబేడ్కర్, కాన్షిరాం చూపిన రాజ్యాంగ మార్గంలో నడవాలి” అని విశారదన్ మహారాజ్ (Visharadan Maharaj ) పిలుపునిచ్చారు.
Read Also :

