BIG BREAKING : తెలంగాణలో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోకు ఎదురుదెబ్బ తగిలింది. రిజర్వేషన్లు ఇవ్వడం నిబంధనలకు విరుద్దమని హైకోర్టు వ్యాఖ్యానించింది.
హౌస్ మోషన్ పిటిషన్ ను టేకప్ చేసిన హైకోర్టు డివిజన్ బెంచ్.. రాష్ట్ర ప్రభుత్వంపై, అడ్వకేట్ జనరల్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. గవర్నర్ ఆమోదం ఇవ్వకుండా.. రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉండగా.. ఎలా జీవో ఇస్తారని మండిపడింది.
అయితే.. సంక్షేమం కోసమే జీవో ఇచ్చామని అడ్వకేట్ జనరల్ చెప్పారు. పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు చెప్పింది కాబట్టే తాము ముందుకెళ్తున్నామని అన్నారు. కానీ ఆయన వాదనతో కోర్టు ఏకీభవించలేదు. చట్టానికి విరుద్ధంగా చేయొద్దని మండిపడింది.
చాలా అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వం.. వచ్చి మరింత గడువు కావాలని పిటిషన్లు వేసిందన్నారు. ఈ అంశంలో కూడా ఎక్స్ టెన్షన్ పిటిషన్ వేయాలని సూచించింది.
నవంబర్ లో గానీ.. మూడు నెలల తర్వాత గానీ ఎన్నికలు నిర్వహించవచ్చు కదా అని చెప్పింది.
ఎట్టి పరిస్థితుల్లోనూ జీవోను ఒప్పుకునేది లేదని చెప్పింది. ఎక్స్ టెన్షన్ పిటిషన్ వేయాల్సిందేనని తేల్చి చెప్పింది.
అలాగే.. ఈ సమస్యలన్నీ పరిష్కారం అయ్యే వరకు పంచాయతీ ఎన్నికలు నిర్వహించబోమని రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు హామీ ఇవ్వాలంది. ఈ విషయంపై ప్రభుత్వ వైఖరి ఏంటో చెప్పాలని అడ్వకేట్ జనరల్ కు సూచించింది.
రిజర్వేషన్లపై స్టే ఇవ్వొద్దని న్యాయమూర్తులను అడ్వకేట్ జనరల్ పదే పదే కోరారు. దసరా సెలవుల తర్వాత ఈ పిటిషన్ పై మరోసారి వాదనలు వినాలని కోరారు. అయితే.. అప్పటి వరకు ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వబోమని హామీ ఇస్తేనే సెలవుల తర్వాత వింటామన్నారు.
రిజర్వేషన్లపై స్టే ఇవ్వొద్దని న్యాయమూర్తులను అడ్వకేట్ జనరల్ పదే పదే కోరారు. దసరా సెలవుల తర్వాత ఈ పిటిషన్ పై మరోసారి వాదనలు వినాలని కోరారు. అయితే.. అప్పటి వరకు ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వబోమని హామీ ఇస్తేనే సెలవుల తర్వాత వింటామన్నారు.
అయితే ప్రభుత్వంతో సంప్రదించి చెప్పాలని అడ్వకేట్ జనరల్ కు న్యాయస్థానం సూచించింది. కానీ తమకు ప్రభుత్వం నుండి ఎవరూ అందుబాటులోకి రావడం లేదని అడ్వకేట్ జనరల్ కోర్టుకు చెప్పారు.
దీంతో కేసు విచారణను అక్టోబర్ 8కు వాయిదా వేస్తున్నట్టు చెప్పింది. ఒకవేళ ఈ గ్యాప్ లో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చినా.. ప్రస్తుత పిటిషన్లను తాము పరిగణనలోక తీసుకుంటామని.. వాటి మెరిట్స్ లో ఎలాంటి ఇబ్బంది ఉండబోదని చెప్పింది.
Read Also :

