ThotaRamudu : 1994లో ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో యమలీల (yamaleela)అనే సినిమా వచ్చింది. ఆ సినిమాలో “తోట రాముడు” అనే ఓ క్యారెక్టర్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ తనికెళ్లభరణి చేశారు. ఆ సినిమాలో ఆయన విలన్.
తోటరాముడికి(ThotaRamudu ) కవిత్వం రాయాలనే కోరిక కలుగుతుంది. ఆలోచన వచ్చిందే తడవుగా కవిత్వం రాస్తాడు. దాన్ని తీసుకుని ఓ పత్రికా కార్యాలయానికి వెళ్తాడు. అక్కడ ఎడిటర్ కు దాన్ని చదివి వినిపిస్తాడు.
ఆ కవిత్వం ఏంటంటే…
“నాకొక బుల్లి చెల్లి…
నాకొక.. బుల్లి.. చెల్లి..
గల్లీనే నేడే దానికి పెళ్లి..
ఇలా నా చెల్లి పెళ్లి.. జరగాలి మళ్లీ మళ్లీ..”
అంటూ కవిత్వాన్ని ముగిస్తాడు.
ఆ లైన్స్ విన్న పత్రికా సంపాదకుడు బిత్తరపోతాడు.
కానీ ఎదురుగా కవిత్వం చదువుతున్నది రౌడీ.
బాగోలేదు.. ఛండాలంగా ఉంది అంటే ప్రాణాలు తీసేస్తాడు.
అందుకే.. బాగోలేదని తెలిసినా.. బాగుందని చెబుతాడు.
ఇప్పుడు ఈ సినిమా స్టోరీ అంతా ఎందుకు అంటే..
హైదరాబాద్ హైటెక్స్ లో ఓ కార్యక్రమం జరిగింది. దాని పేరు కొలువుల పండగ.
గ్రామ పరిపాలన అధికారులుగా ఎంపికైన వారికి.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు కలిసి నియామక పత్రాలు అందించారు.
మరి వీరంతా ఎవరు..?
వీరంతా గతంలో వీఆర్వోలుగా(vro) పనిచేసిన వారు. రెవెన్యూశాఖలో వీఆర్వో వ్యవస్థ ఎంత అవినీతికి అడ్డాగా మారిందో గుర్తించి గత ప్రభుత్వం.. వారిని ఇతర శాఖల్లో సర్దుబాటు చేసింది. కొందరిని తొలగించింది.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక వారికి.. ఓ పరీక్ష పెట్టి.. గ్రామ పరిపాలన అధికారులుగా నియమించారు.
వాళ్లేం కొత్తగా ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకున్నవాళ్లు కాదు. ఇప్పుడే డిగ్రీ అయిపోయి కొత్తగా ఉద్యోగాలు చేస్తున్న వాళ్లు కాదు.
అయినా సరే..
రాష్ట్రం ఆర్థిక కష్టాల్లో ఉందంటూనే.. హైటెక్స్ లో భారీ సభ పెట్టి వారికి నియామక పత్రాలు ఇచ్చారు.
రెగ్యులర్ గా ఎల్ బీ స్టేడియంలో పత్రాల పంపిణీ కార్యక్రమం జరగాలి. కానీ వినాయక నిమజ్జనం నేపథ్యంలో దానిని హైటెక్స్ కు మార్చారు.
ఈ పత్రాల పంపిణీ కార్యక్రమం తెలంగాణలో ఇప్పుడు రోజువారి కార్యక్రమంగా మారిపోయింది.
Read Also :
- 15 ఏళ్లు నేనే ముఖ్యమంత్రి
- ఎదురింటోడితో లేచిపోయిన తోటికోడళ్లు.! చివర్లో అసలు ట్విస్ట్..!
- కవితపై కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు
ఏ రూట్ లో వందేభారత్ రైలును ప్రవేశపెట్టినా.. దానిని స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ వెళ్లి ప్రారంభించడం ఆనవాయితీగా మారిపోయింది.
తెలంగాణలో నియామకపత్రాలు ఇవ్వడం కూడా అలాగే మారింది.
నెలా.. లేదా రెండు నెలలకు ఒకసారి.. ఏదో ఒక పేరు చెప్పి ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నారు.
ఈ మధ్య కాస్త గ్యాప్ ఎక్కువ వచ్చింది. దీంతో గ్రామ పరిపాలన అధికారుల పేరుతో ఈ తతంగం నడిపించేశారు.
ప్రతీ సభలో.. మేం 60 వేల ఉద్యోగాలు ఇచ్చాం అని చెప్పుకోవడం పరిపాటిగా మారిపోయింది. గ్రూప్ 1లో కొన్ని అదనపు పోస్టులు, డీఎస్సీలో కొన్ని అదనపు పోస్టులు చేర్చడం తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత.. ఎలాంటి ఉద్యోగ నోటిఫికేషన్లు రాలేదు.. వాటి పరీక్షలు పూర్తై ఫలితాలు రాలేదు.
అయినా కూడా.. అన్నీ మేమే ఇచ్చాం అంటూ నెలా.. రెండు నెలలకోసారి ఇలాంటి సభ పెట్టుకోవడం పరిపాటి అయిపోయింది.
..
ఇదంతా చూసి… “ఇలా చేయడం వృథా ఖర్చు” అని చెబుదామని కొందరు అధికారులు అనుకుంటున్నారట. “మీకు బాగానే అనిపించినా.. బయట ప్రజలు నవ్వుకుంటున్నారని” ప్రభుత్వ పెద్దకు వివరిద్దామని ఆలోచిస్తున్నారట.
కానీ.. వీళ్లంతా మయలీల సినిమా చూసిన వాళ్లే కదా. అందులో తన ప్రాణాలు ఎందుకు పోగొట్టుకోవాలని పత్రికా సంపాదకుడు అనుకున్నట్టే.. ఇక్కడ తమ ఉద్యోగాలు ఎందుకు పోగొట్టుకోవాలని అధికారులు అనుకుని.. సైలెంట్ అవుతున్నారు.
దీంతో..
“చెల్లికి పెళ్లి జరగాలి మళ్లీ మళ్లీ” అన్నట్టుగానే..
“పత్రాల పంపిణీ.. జరుగుతోంది.. మళ్లీ.. మళ్లీ..”
(గతంలో ఈ నియామక పత్రాలు పోస్టులో వచ్చేవి)
…

