TG Weather Update : తెలంగాణలో వచ్చే ఐదు రోజులు భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది.
ఇది ఒడిశా తీరానికి ఆనుకొని ఉందని తెలిపారు.

తుఫాను ప్రసరణ 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించింది.
ఎత్తుకు వెళ్లేకొద్దీ నైరుతి వైపు మళ్లుతుంది .
ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది.
రాబోయే రెండురోజుల్లో మరింత బలపడే అవకాశం ఉందని తెలిపారు.
మంగళవారం భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అతిభారీ వర్షాలు పడతాయని అంచనా వేశారు.
ఈ రెండు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.
కొత్తగూడెం, హన్మకొండ, జనగాం, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది.
అలాగే ఆసిఫాబాద్, మంచిర్యాల, నల్గొండ, పెద్దపల్లి, సూర్యాపేట జిల్లాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
వరంగల్, భువనగిరి, మహబూబాబాద్ జిల్లాల్లో కూడా అక్కడక్కడ భారీవర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

