Congress Social Media : తెలంగాణ కాంగ్రెస్ లో మరో కిరి కిరి..!

BREAKING NEWS-13-BATUKAMMA.COM

Congress Social Media : తెలంగాణ కాంగ్రెస్ పై ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆశలు వదిలేసుకున్నారని తాజాగా ఓ సంచలన అంశం బయటకు వచ్చింది. తనను కలిసిన తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో ఆయన ఈ మాట అన్నట్టుగా చెప్పారు.

దీనికి కారణం అనేక అంశాలున్నాయి. కాంగ్రెస్ పార్టీలో పరిస్థితి సరిగా లేదు. మరోవైపు.. పాలనలోనూ కాంగ్రెస్ విఫలమైంది. మంత్రులు, ఎమ్మెల్యేలుతిరగబడుతున్నారు.

ముఖ్యమంత్రిపై, మంత్రులపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. దీంతో పరిస్థితి గందరగోళంగా మారింది.

చివరకు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలోనూ (Congress Social Media :)ఇదే పరిస్థితి కొనసాగుతోంది.

Pendayala vamshikrishna congress social media

బీఆర్ఎస్ పార్టీ నుండి వచ్చిన ఎమ్మెల్యేలు, లీడర్లకు కాంగ్రెస్ లో అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని మొదటి నుండి ఆరోపణలు వస్తున్నాయి.

ముందు నుండి పార్టీ కోసం కష్టపడుతున్నవారిని పక్కనపెట్టి కొత్తగా వచ్చినవాళ్లను అందలం ఎక్కిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.

పార్టీలోని సోషల్ మీడియాలో కూడా ఇదే జరుగుతోందని.. పూర్తిగా దాన్ని నిర్వీర్యం చేశారని.. టీపీసీసీ సోషల్ మీడియా మాజీ కార్యదర్శి పెండ్యాల వంశీకృష్ణ(Pendyala Vamshikrihna) సంచలన ఆరోపణలు చేశారు.

రాజీనామా చేస్తున్నట్టు ఓ పెద్ద లేఖ రాశారు. సోషల్ మీడియాలో ఇది వైరల్ అవుతోంది.

Pendyala Vamshikrishna Letter on congress social media

Read Also :