Sajjanar : యూట్యూబ్ ఛానళ్ల పేరుతో అసభ్య కంటెంట్ ను అప్ లోడ్ చేస్తున్నవారిపై హైదరాబాద్ పోలీసులు చర్యలు మొదలు పెట్టారు.
ఇటీవల కొన్నివీడియోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యాయి. ఇద్దరు మైనర్లు.. ఇంటర్వ్యూలో ముద్దుపెట్టుకుంటారు.
ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తి చూస్తుండగానే అమ్మాయి.. అబ్బాయిని ముద్దు పెట్టుకుంటుంది. ఆ ఛానల్ దాన్ని అలాగే అప్ లోడ్ చేసింది.
అలాగే మరికొన్ని ఛానళ్లు కూడా ఇన్ స్టాగ్రామ్ లో కాస్త వైరల్ అవుతున్న మైనర్లను తీసుకొచ్చి వాళ్లతో బూతు పనులు చేయిస్తున్నారు. బూతు మాటలు మాట్లాడిస్తున్నారు.
అవి చిన్నారులపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి.
అలాంటి వీడియోలు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
దీంతో హైదరాబాద్ కొత్త కమిషనర్ సజ్జనార్(Sajjanar).. వాటిపై ఫోకస్ పెట్టారు. ఇలాంటి చిల్లర పనులు చేసే వారిని వదిలిపెట్టేది లేదని ఈ మధ్యే హెచ్చరించారు.
ఇప్పుడు అలాంటి రెండు యూట్యూబ్ ఛానళ్లపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వ్యూస్ కోసం విలువలను మరిచిపోతున్న వారికి వాయించి వదిలిపెట్టారు.
మైనర్లతో అసభ్యకరమైన కంటెంట్ చేసిన రెండు యూట్యూబ్ చానళ్లపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో పొక్సో చట్టం కింద కేసు నమోదు అయింది.
సోషల్మీడియాలో స్వేచ్ఛ ఉంది కదా అని.. ఏ తరహా కంటెంట్ అయినా చేస్తామంటే కుదరదు. చట్టప్రకారం బాధ్యులపై కఠిన చర్యలను… https://t.co/1j6FApYPku pic.twitter.com/WTQIEZ2dl8
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) October 18, 2025
మైనర్లతో జుగుప్సాకరమైన ఇంటర్వ్యూలు చేస్తున్న ఛానళ్లపై పోక్సో యాక్ట్ తో పాటు, ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. 67, 67 a, 67 b ITA, 294,79, r/w49 BNS, 8, r/w 7, 12, r/w 11, 14, r/w 13, 17,r/w16 POCSO ACT 2012 సెక్షన్ల కింద నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు.
ఇష్టారాజ్యంగా ఏది పడితే అది సోషల్ మీడియాలో పెడతామంటే ఊరుకునేది లేదని హైదరాబాద్ సీపీ సజ్జనార్ హెచ్చరించారు.
Read Also :

