Revanth Reddy : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. హైదరాబాద్ లో జరిగిన గ్రూప్ 2 నియామకపత్రాల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. స్పీచ్ మొదలు పెట్టినప్పటి నుండి.. ముగింపు వరకు కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు జపం చేస్తూనే ఉన్నారు.
గత పడేళ్లు.. కేసీఆర్ చిత్తశుద్ధితో పనిచేసి ఉంటే కాళేశ్వరం.. కూళేశ్వరం అయి ఉండేది కాదని రేవంత్ రెడ్డి అన్నారు. లక్ష కోట్లు గోదావరిలో పోసి నిర్మించిన కాళేశ్వరం కట్టడం, కూలడం మూడు సంవత్సరాలలోనే జరిగిపోయిందని చెప్పారు. ఏ దేశంలోనూ ఇలా జరగలేదన్నారు.
ఇక కేసీఆర్ ఫాంహౌస్ లో ఎకరానికి కోటి రూపాయలు సంపాదించినప్పుడు.. ఆ విద్య రైతులకు ఎందుకు నేర్పలేదని ప్రశ్నించారు. రైతులు పండించిన పంటను గత ప్రభుత్వం కొనలేని పరిస్థితిలో ఉండేదన్నారు.
అలాంటప్పుడు తెలంగాణ వచ్చి ఉపయోగం ఏంటని ప్రశ్నించారు.
ఇక.. పదేళ్లు పాలించినోళ్లు తాము చేస్తున్న పనులపై తప్పుడు కేసులు పెడుతున్నారని రేవంత్ రెడ్డి చెప్పారు. తమ పనులకు అడ్డుపడుతున్నారని.. వీధులెక్కి రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు. ఇక
సోషల్ మీడియాలో పెట్టుబడులు పెట్టి బురదచల్లుతున్నారని రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఆరోపించారు.
గ్రూప్ 2 నియామకపత్రాల పంపిణీ కార్యక్రమంలో…
కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావుపై సెటైర్లు వేస్తూ కథ చెప్పిన రేవంత్ రెడ్డి..#revanthreddyanumula #kcr #ktr #harishrao pic.twitter.com/u0E5wIa34p
— Prabhakar Venavanka (@Prabhavenavanka) October 18, 2025
గత ప్రభుత్వం నిరుద్యోగులను పట్టించుకోలేదని.. నిరుద్యోగసమస్యను పరిష్కరించలేదని రేవంత్ రెడ్డి అన్నారు. తాము అధికారంలోకి రాగానే మొదటి ఏడాదిలోనే 60 వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకొచ్చారు.
ఇక.. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావును విమర్శిస్తూ.. చంద్రసేనుడు, హరిసేనుడు, రామసేనుడు అంటూ కథ చెప్పారు.
వీళ్లంతా.. గురుకులాల్లో పిల్లలు చనిపోతే, రైతులు చనిపోతే, ఏ చిన్న సమస్య వచ్చినా రాద్ధాంతం చేస్తారని.. సమస్యలు రాకుండా చూడాలని నియామకపత్రాలు అందుకున్న వారికి సూచించారు.
అయితే.. గత పదేళ్లలో ఇలాంటి పనులన్నీ రేవంత్ రెడ్డి కూడా చేశారు కదా అని.. అక్కడికి వచ్చినవాళ్లు మాట్లాడుకోవడం కనిపించింది.
మల్లన్న సాగర్ నుండి.. గురుకులాల దాకా ఎక్కడ ఏ చిన్న ఘటన జరిగినా రచ్చ రచ్చ చేశారని మాట్లాడుకున్నారు.
ఇక గత పదేళ్లు యూట్యూబ్ ఛానళ్లను, సోషల్ మీడియాను రేవంత్ రెడ్డి ఎలా వాడుకున్నారో, వారికి ఎంతెంత ఇచ్చారో.. రెండేళ్లుగా అవే యూట్యూబ్ ఛానళ్లు చెబుతున్న విషయాన్ని రేవంత్ రెడ్డి మరిచిపోయారా అని అక్కడికి వచ్చినవాళ్లు నవ్వుకున్నారు.
Read Also :

