Political Story : రండసేనుడి కథ.. మామూలు ట్విస్టులు కాదు..! మస్తు కామెడీ..!

political-story-randasenudi katha

Political Story : తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు రంజుగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి… కేసీఆర్ ను, గత ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూనే ఉన్నారు.

ఈ నేపథ్యంలో శనివారం గ్రూప్ 2 నియామకపత్రాల పంపిణీ కార్యక్రమంలో కూడా అదే పనిచేశారు. విమర్శల్లో మరో అడుగు ముందుకేసి..కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావుపై వ్యంగ్యంగా ఓ కథ చెప్పారు.

దానికి కౌంటర్ గా ఇప్పుడు మరో కథ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదే “రండసేనుడి కథ” శివ అనే వ్యక్తి తన ఎక్స్ అకౌంట్ లో ఈ  కథను  పోస్ట్ చేశారు.

మీరూ చదివి కాసేపు నవ్వుకోండి.

త్రిలింగ దేశంలో చంద్రసేనుడు, రామసేనుడు, హరిసేనుడి గురించి చెప్పి మన GM సాబ్ అసలు సిసలైన రండసేనుడి గురించి మర్చిపోయిండు ఏంది పాపం..??

నేను చెప్తా ఇనుకోర్రి ఆ రండసేనుడి కథ..

అంత క్రితం చంబాసేనుడు అనే రాజు, మరియు అతని పూర్వీకులు మాయమాటలు చెప్పి త్రిలింగదేశాన్ని తమ దేశంతో కలుపుకొని, రెండు దేశాలను పాలిస్తూ, త్రిలింగ దేశ ప్రజలను మోసం చేసి, వాళ్ళను చిన్నచూపు చూసేవాళ్ళు. దశాబ్దాలుగా ఆ మోసాన్ని, నయవంచనను భరిస్తూ వస్తున్న ప్రజల బాధను, దగాపడిన ఆత్మాభిమానాన్ని చూసి కడుపు మండిన చంద్రసేనుడు తన అసమాన పోరాట పటిమతో త్రిలింగ దేశాన్ని తిరిగి విడదీసి, ఆ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ తీర్చి, ప్రజలచే ఆ దేశానికి రాజుగా ఎన్నుకోబడి సుభిక్షంగా పరిపాలిస్తున్నాడు.

అది చూసి కన్నుకుట్టిన చంబాసేనుడు, త్రిలింగ దేశాన్ని ఎలాగైనా నాశనం చెయ్యాలనుకొని త్రిలింగ దేశంలోనే దొమ్మీలు దొంగతనాలు దోపిడీలు దౌర్జన్యాలు కబ్జాలు చేసే రండసేనుడు అనే తన అనుంగు శిష్యుడిని పావుగా వాడుకొని త్రిలింగ దేశ రాజ్యాధికారీ ఒకరిని ప్రలోభ పెట్టి, చంద్రసేనుడికి వెన్నుపోటు పొడిచి తిరిగి అధికారం చేజిక్కించుకోవాలని కుట్ర పన్నుతాడు.

ఆ విషయాన్ని వేగుల ద్వారా కనిపెట్టిన చంద్రసేనుడు తన రాజ్యాధికారితో నాటకం ఆడించి చంబాసేనుడిని, అతని శిష్యుడు రండసేనుడిని, ప్రలోభపెడుతున్న సమయంలో సాక్ష్యాధారాలతో సహా పట్టుకొని ప్రజల ముందు దోషులుగా నిలబెడతాడు.

ఆ సమయంలో చంబాసేనుడు చంద్రసేనుడి కాళ్ల మీద పడి, ఇంకెప్పుడూ నీ రాజ్యం వైపు నేను కన్నెత్తి కూడా చూడను, సాటి రాజుగా నన్ను మన్నించి వదిలేస్తే కట్టుబట్టల్తో సహా మా రాజ్యానీకీ వెళ్ళిపోతా అని వేడుకుంటే, చంద్రసేనుడు కరిగిపోయి, క్షమించి వదిలేస్తాడు.

కానీ సొంత దేశానికి నమ్మకద్రోహం చేయ తలపెట్టిన రండసేనుడిని మాత్రం వదిలెయ్యక చట్టపరకారం తనకి కారాగార శిక్ష పడేలా చేస్తాడు.

ఆ శిక్ష నుండి అనుమతి మీద బయటికి వచ్చిన రండసేనుడు చంద్రసేనుడి మీద కోపంతో రగిలిపోతూ తనని ఎలాగైనా నాశనం చెయ్యాలని నిశ్చయించుకొని దానికోసం దేవుడి వరం కావాలి అని కఠోర తపస్సు చేస్తాడు.

ఆ తపస్సును తారానది ఒడ్డున సురేఖావాణి అనే వృక్షం కింద చేస్తూ ఉంటాడు. అతని తపస్సుకు మెచ్చిన దేవుడు, ఇలాంటి దుర్మార్గుడికి నేను వరం ఇవ్వాల్సి వస్తుందే అని లోలోపల బాధ పడుతూ, అయిష్టంగానే రండసేనుడి ముందు ప్రత్యక్షమయ్యి, “రండా.. నీ తపస్సుకి మెచ్చితిని, నీకేం వరం కావాలో కోరుకో..” అనెను.

దానికి రండసేనుడు, “స్వామీ, నన్ను అడ్డంగా దొరకబట్టి జనం ముందు దోషిగా నిలబెట్టి, నన్ను చెరసాలలో వేసి అవమానించిన చంద్రసేనుడిని ఓడించి ఆ దేశానికి రాజునయ్యే వరం ప్రసాదించు..” అని కోరుకుంటాడు.

దానికి ఒకింత దిగ్భ్రాంతికి గురైన దేవుడు, దివ్యదృష్టితో చూసి, త్రిలింగ దేశ ప్రజల క్షేమం కోసం, అసలు రాజు అంటే ఎలా ఉండాలో వాళ్లకి కూడా తెలిసొస్తే, దొంగలు మోసకారులు, దగాకోరుల మాటలు నమ్మితే వాళ్ళెలా  మోసపోతారో ప్రజలకు తెలిసొచ్చి, మున్ముందు చంద్రసేనుడిని మరింత కాలం రాజుగా ఎన్నుకునేలా ఉండడం కోసం ఒకసారి రండసేనుడి లాంటి మూర్ఖుడు మోసగాడు రాజు ఔతాడని తెలుసుకొని, “రండా.. తథాస్తూ..” అంటాడు..!!

దానికి ఉబ్బి తబ్నిబ్బైపోయిన రండసేనుడు “స్వామీ, ఈ జన్మకు ఇది చాలు స్వామీ” అని సాష్టాంగ ప్రణామం చేసి, నిల్చొని, “కానీ స్వామీ, మరి నాకు అంత తెలివి లేదు, అనుభవం లేదు, అన్ని శక్తియుక్తులు లేవు, అంతటి పోరాటపటిమ లేదు కదా, చంద్రసేనుడిని ఎలా ఓడించడం” అని తన ధర్మ సందేహాన్ని బయటపెడతాడు.

దానికి దేవుడు ఒక చిన్న చిరునవ్వు నవ్వి, “త్రిలింగ దేశ ప్రజల ఖర్మఫలానుసారం వాళ్ళకి నీలాంటి మూర్ఖుడు మోసగాడు రాజయ్యే శాపం ఉంది రండా.. కాబట్టి చింతించకుండా నీకున్న కుటిల బుద్ధిని ప్రదర్శిస్తూ, నీ మాయమాటలు వలను విసురుతూ, ప్రజలను మభ్యపెట్టు, నీ కోరిక నెరవేరుతుంది, దానికి నీ గురువు చంబాసేనుడు కూడా తన పచ్చ సైన్యంతో హితోధిక సాయం చేస్తాడు..” అని సెలవిస్తాడు.

ఆ వరంతో సంభ్రమాశ్చర్యానికి లోనైన రండసేనుడు, ఆనందపారవశ్యంతో తేలిపోతూ, దేవుడు చెప్పినట్లుగానే తన కుటిల బుద్ధిని, కుట్రలు కుతంత్రాలను, మాయమాటలను ప్రయోగించి, చంద్రసేనుడి మీద ప్రజలలో వ్యతిరేకత సృష్టించి, అధికారాన్ని చేజిక్కించుకుంటాడు..”

అనతికాలంలోనే తాము మోసపోయామని గ్రహించి, తాము చేసిన పొరపాటుని సరిదిద్దుకునే సదవాకాశం కోసం, రండసేనుడిని ఓడించి, తిరిగి చంద్రసేనుడిని తమ రాజుగా ఎన్నుకోవడం కోసం ప్రజలు కంకణ బద్దలై ఉన్నారు..!!

ఆ విషయం ముందే తెలిసిన రండసేనుడు తన చేతిలో ఉన్న అధికారాన్ని వాడుకొని అవినీతిని పెంచి పోషిస్తూ తన వందిమాగధులకు, బంధుమిత్రులకు దొరికినంత సంపదను దోచిపెట్టడం షురూ చేశాడు.

ఇవన్నీ గమనిస్తున్న రామసేనుడు, హరిసేనుడు,  రండసేనుడి పాపం పండి తన భవిష్యత్ ఏమౌతుందో అర్థం చేసుకొని, ప్రజలు తిరిగి మోసపోకుండా వాళ్లను చైతన్యవంతులను చేయసాగారు..!!

..

Read Also :