Nizamabad : కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి పోలీసు శాఖ బాసట.

nizamabad-Dgp announced exgratia for constable pramod family

Nizamabad : నిజామాబాద్ లో కరడుగట్టిన నేరస్తుడు షేక్ రియాజ్ చేతిలో దారుణ హత్యకు గురైన పోలీస్ కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి పోలీసు శాఖ అండగా నిలబడింది.

ఘటన జరిగిన 48 గంటల్లోనే నిందితుడిని ఎన్ కౌంటర్ పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. రియాజ్ దాడిలో ప్రాణాలు కోల్పోయిన ప్రమోద్ కుటుంబానికి పోలీసు శాఖ అండగా ఉంటుందని డీజీపీ శివధర్ రెడ్డి ప్రకటించారు.

ప్రమోద్ భార్య ప్రణీతకు, అతిచిన్న వయసులోనే తండ్రిని కోల్పోయిన అతని ముగ్గురు కుమారులకు, వారి కుటుంబానికి ప్రభుత్వం, పోలీసుశాఖ పూర్తిస్థాయిలో అండగా ఉంటామని ప్రకటించారు.

GO Rt No. 411 ప్రకారం ఒక కోటి రూ ఎక్స్ గ్రేషియా ఇస్తామని వెల్లడించారు.

అమరుడైన కానిస్టేబుల్ పదవీ విరమణ వరకు లాస్ట్ పే డ్రాన్ సాలరీ ఇస్తామన్నారు. కుటుంబసభ్యులలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు.. GO155 ప్రకారం 300 గజాల ఇంటిస్థలం ఇస్తామని తెలిపారు.

అలాగే పోలీస్ భద్రత నుండి 16 లక్షల ఎక్స్ గ్రేషియా, పోలీస్ వెల్ఫేర్ నుండి 8 లక్షల ఎక్స్ గ్రేషియాను ప్రమోద్ కుటుంబానికి మంజూరు చేసి ఆదుకుంటామని డీజీపీ వెల్లడించారు.

నిజామాబాద్ లో(Nizamabad) కానిస్టేబుల్ ప్రమోద్ ను రియాజ్ అనే నేరస్తుడు అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. ఆ తర్వాత తప్పించుకుని పోయాడు. మరో వ్యక్తిపైనా దాడి చేశాడు. ఈ క్రమంలో సారంగాపూర్ సమీపంలో నిందితుడుని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో అతనికి గాయాలయ్యాయి.

అయితే నిజామాబాద్ జిల్లా హాస్పిటల్ లో ట్రీట్మెంట్ జరుగుతున్న సమయంలో ఇవాళ ఉదయం మరోసారి రియాజ్ తప్పించుకునే ప్రయత్నం చేశాడు. కాపలాగా ఉన్న కానిస్టేబుల్ తుపాకీ లాక్కుని తప్పించుకునే ప్రయత్నం చేశాడు.

దీంతో అక్కడే ఉన్న మరో కానిస్టేబుల్ అతడిని కాల్చాడు. దీంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

Read Also :