Gangotri Santhosh : జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నంలో ఆత్మహత్య చేసుకున్న గంగోత్రి విషయంలో ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది.
సెప్టెంబర్ 26న గంగోత్రి, సంతోష్ ప్రేమ పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లికి పెద్దలు కూడా ఒప్పుకోవడంతో అంతా కలిసే పెళ్లి చేశారు.
అయితే దసరా రోజు రాత్రి గంగోత్రి తన అత్తగారింట్లో ఆత్మహత్య చేసుకుంది. పెళ్లైన ఆరు రోజులకే యువతి ప్రాణాలు తీసుకోవడం అందరిని కలచివేస్తోంది.
అయితే గంగోత్రి ఆత్మహత్యకు కారణం భర్త చేసిన గొడవేనని కుటుంబసభ్యులు తెలిపారు. అది కూడా మటన్ కూర విషయంలో మొదలైందని చెప్పారు.

దసరా రోజు అక్టోబర్ 2 నాడు గంగోత్రి తన భర్తను తీసుకుని తన తల్లిగారింటికి వచ్చింది. కొత్త అల్లుడు కాబట్టి అత్తగారింట్లో దావత్ ఇచ్చారు. మటన్ కూర, బగారా రైస్, ఇతర పిండి వంటలతో దావత్ చేశారు.
అయితే.. మటన్ కూరలో కారం ఎక్కువైంది. పండుగ పూట కూరంలో కారం ఎక్కువైతే పరిస్థితి ఎలా ఉంటుంది. అందులోనూ కొత్త అల్లుడు.
దీనిపై గంగోత్రి తల్లిగారి ఇంట్లోనే సంతోష్ ఆగ్రహం వ్యక్తంచేశాడు. ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో తల్లిదండ్రులు సర్దిచెప్పి, కూతురు, అల్లుడిని తమ ఇంటికి పంపించారు.
సంతోష్ ఇంటికి వెళ్లిన తరవ్త కూడా మటన్ కూరలో కారం ఎక్కువైన అంశంపై గొడవ జరిగిందని అంటున్నారు. కొత్త అల్లుడిని ఇలాగేనా చూసుకునే అని భార్యపై సంతోష్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.

అసలే అత్తగారింటికి వచ్చిన బిడియంలో ఉన్న అమ్మాయి.. భర్త ఆగ్రహంతో హడలిపోయింది. పెళ్లైన వారం రోజులకే ఇలాంటి ఘటన జరిగే సరికి తట్టుకోలేకపోయింది.
తాను ప్రేమించిన వాడితో ఊహించుకున్న జీవితం వేరు.. ఇప్పుడు జరుగుతున్నది వేరని కుమిలిపోయింది. మరో మార్గం లేక.. మరో ఆలోచన రాక.. అర్థరాత్రి అత్తగారింట్లో ప్రాణాలు తీసుకుంది.
కూరలో కారం ఎక్కువైన చిన్న అంశానికి భర్త చేసిన రచ్చ వల్ల.. కాళ్ల పారాణి ఆరకముందే గంగోత్రి బూడిదై ఆ గంగమ్మ ఒడికే, నేలతల్లి ఒడికి చేరిపోయింది.
నచ్చిన వాడిని చేసుకుంది.. నా బిడ్డ జీవితాంతం సుఖంగా, సంతోషంగా ఉంటుందనుకున్న అమ్మానాన్నల కళ్లతో పండుగ పూట తీరనిశోకాన్నినింపి.. కానరాని లోకాలకు వెళ్లిపోయింది.
..
Read Also :.

