Kcr Songs : కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు మరో సమస్య వచ్చి పడింది. ఇప్పటికే రాష్ట్రంలో ప్రజా వ్యతిరేకతతో ఇబ్బందులు పడుతోంది.
ఎమ్మెల్యేలు, మంత్రులు ఎక్కడికెళ్లినా ప్రజలు నిలదీస్తున్నారు. దీంతో పర్యటనలు ఉంటే భారీ బందోబస్తు పెడుతున్నారు. దీంతో ప్రజల నుంచి మరింత ఆగ్రహం వ్యక్తం అవుతోంది.
తాజాగా మరో సమస్య వచ్చి పడింది.
వినాయక చవితి వేడుకల్లో ఎక్కడ చూసినా కేసీఆర్ పాటలో వినిపిస్తున్నాయి.
నిమజ్జన కార్యక్రమాలు మొదలైన దగ్గర్నుంచి.. ప్రతీ రోజు వందలాది వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అన్నింటిలో కూడా కేసీఆర్ పాటలే వినిపిస్తున్నాయి. “సారే కావాలంటున్నరే..”, “గులాబీల జెండలే రామక్క” “దేఖ్లేంగే” వంటి పాటలు (Kcr Songs) మారుమోగుతున్నాయి.
కింది లింక్ లో 50కి పైగా పాటలున్నాయి..
పల్లె నుండి పట్నం వరకు గణనాథుని నిమజ్జన శోభయాత్రలో కేసీఆర్ గారి పాటలతో మారు మోగిన తెలంగాణ…!
BRS is Not In Power
But It Is everyones Hearts 🩷#KCR #Telangana #GaneshNimajjanam2025Thread
📍Tank Bund
(1/n) pic.twitter.com/yNMkSlbkER— Praveen Reddy (@Praveen_Prabha_) September 6, 2025
హైదరాబాద్ హుస్సేన్ పరిసరాల్లో అయితే మొత్తం ఇవే పాటలు. సెక్రటేరియట్ దగ్గరకు రాగానే చాలామంది కేసీఆర్ పాటలు పెట్టుకుని డ్యాన్స్ చేస్తున్నారు.
కేవలం సిటీలోనే కాదు.. మారుమూల పల్లెల్లో కూడా ఇదే ట్రెండ్ నడుస్తోంది.
ఇదే ఇప్పుడు ముఖ్యమంత్రికి, కాంగ్రెస్ ముఖ్యనేతలకు కోపం తెప్పించిందని అంటున్నారు.
Read Also :
- ఎదురింటోడితో లేచిపోయిన తోటికోడళ్లు.! చివర్లో అసలు ట్విస్ట్..!
- మొగుడిని వేసేసి మామూలు పర్ఫార్మెన్స్ కాదు
రాష్ట్రంలో అధికారంలో ఉన్నది మనమా.? వాళ్ల అని.. ఓ ముఖ్య నాయకుడు మరో నాయకుడితో అన్నట్టు తెలుస్తోంది. వాళ్ల పాటలు అంతలా వైరల్ అవుతోంటే మీరేం చేస్తున్నారని గట్టిగానే తిట్టారట.
ఆ వీడియోలు తీసుకొచ్చి బీఆర్ఎస్ సోషల్ మీడియా అంతలా ప్రచారం చేసుకుంటోంటే.. మన నాయకులు, మన కార్యకర్తలంతా ఏం పీ*తున్నారని గట్టిగానే ఇచ్చుకున్నారని అంటున్నారు.
“వీళ్ల పాటలేందో గని.. మీదున్నోళ్లు మమ్ములను తిట్టి సంపుతున్నరు” అని ఓ కిందిస్థాయి నాయకుడు నిట్టూర్పు విడిచాడు.
అంటే పాటల గురించి పై స్థాయి నాయకుల నుండి ఏ స్థాయిలో ప్రెజర్ ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఎలాగైనా మన పాటలు వైరల్ కావాలని.. లేకపోతే బాగుండదని కూడా పై నాయకులు హెచ్చరించారని సమాచారం.
పై నుంచి చీవాట్లు పెట్టడంతోనే.. ఇవాళ ఖైరతాబాద్ మహాగణపతి ముందు.. చరిత్రలో మొదటిసారిగా ఒక రాజకీయ పార్టీ పాటలు పెట్టారని అంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి పాట పెట్టడానికి పై నుంచి వచ్చిన ఒత్తిళ్లే కారణమంటున్నారు.
ఇవాళ్టి నుండి రాబోయే రెండు మూడు రోజుల వరకు సోషల్ మీడియాలో తమ పాటలే మారుమోగేలా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.
Read Also :
- కవితపై హరీష్ రావు సంచలన రియాక్షన్
- 15 ఏళ్లు నేనే ముఖ్యమంత్రి
- కవితపై కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు
- చెల్లి పెళ్లి జరగాలి మళ్లీ మళ్లీ..!
..

